జీవకణాలతో రోబోల సృష్టి.. ఆ విషయాల్లో అచ్చం మనుషుల్లాగే..!

by Javid Pasha |   (  Updated:2026-05-06 08:46:46  IST  )

శాస్త్రవేత్తలు జీవకణాలతో సృష్టిస్తున్న బయో-రోబోలు మనుషుల్లాగే బిహేవ్ చేస్తయాి. చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్వయంగా నయం చేసుకుంటాయి.

జీవకణాలతో రోబోల సృష్టి.. ఆ విషయాల్లో అచ్చం మనుషుల్లాగే..!
X

దిశ, ఫీచర్స్ : రోబోటిక్ టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే వైర్లు, మెటల్ ఆధారిత రోబోలు హల్ చల్ చేస్తుండగా.. ఇటీవల జీవకణాలతో ల్యాబ్‌లో తయారవుతున్న రోబోలు సైతం ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. శాస్త్ర వేత్తలు ప్రయోగశాలల్లో సృష్టించిన కండరాల కణాలు(muscle cells), నాడీ కణాలు(Neurons), ఇతర జీవ పదార్థాలను ఏఐ నియంత్రణతో ఉన్న రోబోటిక్ స్ట్రక్చర్‌తో కలిపి కొత్త రకం రోబోలను క్రియేట్ చేస్తున్నారు. నిపుణుల ప్రకారం.. ఈ బయో-హైబ్రిడ్ రోబోల ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవకణాలతో సృష్టిస్తున్న బయో-రోబోల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి ఇతర జీవుల్లాగే కదలగలవు, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా ప్రతిస్పందించగలవు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తమను తామే స్వయంగా రిపేర్ చేసుకోగలవు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ సాఫ్ట్ ప్రొస్థెటిక్స్ (మెత్తని కృత్రిమ అవయవాలు), సర్జికల్ రోబోలు, అలాగే డ్రగ్ అసిస్టెంట్ సిస్టమ్స్‌లో ఉపయోగపడుతోందని కూడా చెబుతున్నారు. పైగా ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం $166 మిలియన్(సుమారు ₹1,577 కోట్లు ) మార్కెట్ సైజు 2035 నాటికి $2.7 బిలియన్ల(సుమారు ₹25,650 కోట్లు)కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక వైపు మెటా మనుషులను అర్థం చేసుకునే రోబోలను రూపొందిస్తుంటే, మరో వైపు శాస్త్రవేత్తలు మనుషుల జీవన కణాలతో అచ్చం మనుషుల్లా ప్రవర్తించగల రోబోలను తయారు చేస్తున్నారు. అంటే.. మానవులు నేడు మేధస్సు ఉన్న యంత్రాలను మాత్రమే కాకుండా, జీవించగల యంత్రాలను కూడా సృష్టిస్తున్నారు.

ప్రయోజనాలు

* ఇవి సాధారణ రోబోల మాదిరి బ్రేక్ అయితే మనుషులపై ఆధారపడవు. గాయాలు లేదా డ్యామేజ్ అయినప్పుడు స్వయంగా రిపేర్ చేసుకుంటాయి.

*మెటల్ & వైర్డ్ రోబోలకంటే తక్కువ ఎనర్జీని వాడతాయి. జీవకణాలు సహజంగానే శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి.

*మనుషుల కండరాల్లాగా స్మూత్‌గా, నేచురల్‌గా కదులుతాయి. ఇవి మనుషులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పనులకు కూడా సురక్షితం

*మనుషులు, ఇతర జీవుల్లాగే చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ప్రవర్తిస్తాయి.

*కృత్రిమ అవయవాలు (Prosthetics), సర్జికల్ రోబోలు, డ్రగ్ టెస్టింగ్ వ్యవస్థలలో ఎక్కువ ఉపయోగపడతాయి.

*దెబ్బలు తగిలినా స్వయంగా నయం కావడంవల్ల రిపేర్ ఖర్చులు బాగా తగ్గుతాయి.

*మానవ శరీరంతో ఈజీగా అనుసంధానం అవుతాయి. కాబట్టి ఇంప్లాంట్లు, మెడికల్ అప్లికేషన్లకు చాలా అనువైనవి.

*సాధారణ రోబోల కంటే తక్కువ విద్యుత్ వాడటంవల్ల ఎనర్జీ సేవింగ్ & ఎకో-ఫ్రెండ్లీగా ఉంటాయి.

Next Story