- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Tips: ఈ చిన్న టిప్‌తో కళ్లజోడుకు గుడ్ బై చెప్పేయండి..!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలామందికి కళ్లజోడ్లు వస్తున్నాయి. చిన్న వయస్సులోనే ఆహార లోపంతో కాని ఇతర కారణాల వల్ల కాని కంటి చూపు మందగిస్తుంది. కొందరు అదే పనిగా స్క్రీన్‌ని చూడడం వల్ల కూడా కంటి సమస్యలు వస్తున్నాయి. కళ్లలో మంట, దురద కంటి చూపును తగ్గిస్తుంది. ఈ కంటి సమస్యలపై శ్రద్ధ చూపకపోతే అంధత్వం కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న చిట్కాను పాటించండి చాలు.
ప్రతి రోజూ తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తరువాత తీసుకునే సోంపు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బాదం మెదడుకు జ్ఞాపకశక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియ, కంటికి సంబంధించిన పోషకాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. 40 లేదా 50 గ్రాముల బాదం పప్పు, అదే పరిమాణంలో సోంపు గింజలను తీసుకోవాలి. అందులో 5 గ్రాముల తెల్ల మిరియాలు, దానికి సరిపడా పటిక బెల్లం, మూడు లేదా నాలుగు యాలకులను తీసుకోవాలి. వాటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి.
ఈ పౌడర్‌ను ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చటి పాలలో ఒక టీ స్పూన్ కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది కంటి చూపుకు మాత్రమే కాకుండా శరీరం భాగాలకు విశ్రాంతిని ఇచ్చి, హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ ఉదయాన్నే కంటికి సంబంధించిన చిన్న చిన్న వ్యాయమాలు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.