- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరదలకు కొట్టుకుపోయినా మళ్లీ నిలబడిన సరస్వతీ విద్యాలయం.!
సరస్వతీ విద్యాలయంలో మొత్తం 120 మంది విద్యార్థులున్నారు.

బడి బాగుంటేనే..
విద్యార్థుల భవిత బాగుంటుంది.
లక్షల రూపాయల ఫీజులు చెల్లించే స్థోమత అందరికీ ఉండదు కదా.?
ప్రభుత్వమో.. ఎన్జీవోలో సాయం చేస్తే తప్ప..
గ్రామీణ పాఠశాలల్లో చదివే పరిస్థితి లేదు.
అలాంటి ఒక స్కూల్ వరదల్లో కొట్టుకుపోతే..
అధునాత ఆర్కిటెక్టింగ్‌తో..
పాఠశాలను పునరుద్ధరించి బడిబాట పట్టిస్తున్నారు కొందరు.
- దిశ, ఫీచర్స్
ముంబైలోన కెల్థాన్ గ్రామంలో ఒక పాఠశాల ఉంది. పేద విద్యార్థులకు చదువు నేర్పించే సరస్వతీ విద్యాలయం అది. 2019లో వరదలు విజృంభించి సరస్వతీ విద్యాలయం కొట్టుకుపోయింది. పైకప్పు లేదు. ఆవరణ లేదు. మిగతాది ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో కూడా పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు.. బోధించడానికి టీచర్లూ వెళ్తున్నారు. దీనిని చూసి ఆశ్చర్యపోయి.. అయ్యో పాపం అనుకున్నారు ఇద్దరు ఆర్కిటెక్టర్లు.
పునర్నిర్మాణం వైపు
సరస్వతీ విద్యాలయంలో మొత్తం 120 మంది విద్యార్థులున్నారు. లైటింగ్.. వెంటిలేషన్.. పైకప్పు ఏదీ సరిగ్గా లేకున్నా పిల్లలు చదువుకోసం పరుగులు తీస్తున్నారక్కడికి. ఇది సురక్షితం కాదని గ్రహించి లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్‌ను సంప్రదించాడు ప్రిన్సిపాల్. ఈ ప్రాజెక్టును unTAG ఆర్కికెక్చర్ అండ్ ఇంటీరియర్ కోఫౌండర్స్ గౌరీ సతామ్, తేజేష్ పాటిల్‌కు అప్పగించింది ఆ ఎన్జీఓ. ప్రాజెక్టంటే పైసలేమీ ఇవ్వరు. ఫ్రీ సర్వీస్ అన్నమాట. ఈ ఇద్దరు ఆర్కిటెక్చర్లది గ్రామీణ నేపథ్యమే. సరస్వతీ విద్యాలయాన్ని ఆధునిక ఆర్కిటెక్చర్‌కు అనుగుణంగా పునర్మించేందుకు ముందుకొచ్చారు వాళ్లు.
రెండు దశల్లో
స్కూల్ డిజైనింగ్ 2020లో ప్రారంభమైంది. రెండు దశల్లో దీనిని పూర్తిచేశారు. మొదటి దశలో మంచి వెంటిలేషన్ ఉన్న.. సూర్యకాంతితో నిండిన తరగతి గదులను నిర్మించారు. ఒక స్టాఫ్ రూమ్ కట్టారు. మొదటి అంతస్తులో టాయిలెట్స్.. కింద ఒక వంటగది.. కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు. ఇవన్నీ స్థానికంగా సేకరించిన సామగ్రతితో తక్కువ ఖర్చుతో, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే సాంకేతికతతో నిర్మించారు. పాఠశాల మళ్లీ వరదల్లో చిక్కుకు పోకుండా ఉండేందుకు మొత్తం నిర్మాణాన్ని పిల్లర్లతో పైకి ఎత్తారు. పైన తరగతి గదులు ఉంటాయి. కింద ఉన్న ఖాళీ స్థలంలో సౌకర్యవంతమైన ఆటస్థలం ఏర్పాటు చేశారు.
ఆధునిక టెక్నాలజీతో
సరస్వదీ విద్యాలయం పునర్నిర్మాణం కోసం వినియోగించిన సామగ్రి ఏదో షోరూంలో తీసుకురాలేదు. 25 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉన్న వనరులతో సేకరించింది. స్థానికంగా కాల్చిన ఇటుకలు ప్రధాన సామగ్రిగా మారాయి. సాంప్రదాయకంగా మాత్రమే కాకుండా రాట్ ట్రాప్ బాండ్ అనే సాంకేతికతన ఉపయోగించారు. ఇటుకలను నిలువుగా ఖాళీలతో అమర్చడం అన్నమాట. దీనివల్ల ఇటుకల సంఖ్య తగ్గుతుంది. థర్మల్ ఇన్సులేషన్‌ను జోడించి ఖర్చు తగ్గించారు. కాంతి.. గాలిని ఫిల్టర్ చేయడానికి అనుమతించే రంధ్రాలు కలిగిన స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇది సహజ వెంటిలేషన్‌ను అందిస్తాయి.
ఆత్మగౌరవ వేదిక
2023 చివరి నాటికి సరస్వతి విద్యాలయం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తాన్సా నది ఒడ్డున ఇప్పుడు నిలిచివున్నది కేవలం నిర్మాణాత్మకమైన బలమైన పాఠశాల మాత్రమే కాదు. ఇది ఆత్మగౌరవం.. ఆనందాన్ని వెదజల్లే స్థలం. పిల్లల కళ్లలో ఆనందం చూస్తే అది అర్థమవుతుంది. గతంలో వారు గోడల మధ్యన చదివేవారు. ఇప్పుడు ప్రకాశవంతమైన గాలి.. వెలుతురు ఉన్న గదుల్లో కంప్యూటర్లు.. ఫ్యాన్లు.. లైట్స్.. డిజిటల్ బోర్డుల మధ్యన చదువుతున్నారు. 120 మంది ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు 200కు దాటిపోయింది. ఒకప్పుడు పిల్లలను పాఠశాలకు పంపడానికి సంశయించిన వాళ్లే ఇప్పుడు పోటీలు పడి తమ పిల్లల్ని సరస్వతీ విద్యాలయంలో చేర్పిస్తున్నారు.






