చాయ్-సమోసాపై మనసుపడుతున్న బ్రిటిషర్స్

by Disha Web Desk 7 |
చాయ్-సమోసాపై మనసుపడుతున్న బ్రిటిషర్స్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఇండియాలో చాయ్‌తో పాటు సమోసా రుచిని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో టీ అండ్ బిస్కట్‌ తీసుకోవడం ఇంగ్లీష్ ట్రెడిషన్. కానీ ఈ పద్ధతికి బైబై చెప్పేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువకులు టీ విత్ సమోసాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. ఇక టీతో పాటు తీసుకునే స్నాక్‌గా గ్రానోలా బార్‌కు కూడా డిమాండ్ పెరిగిందని వివరించింది.

యునైటెడ్ కింగ్‌డమ్ టీ & ఇన్‌ఫ్యూషన్స్ అసోసియేషన్ (UKTIA) 1,000 మంది వ్యక్తులపై జరిపిన సర్వే ప్రకారం.. గ్రానోలా బార్‌లు 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల ప్రతి పది మందిలో ఒకరు ఎంపిక చేసుకునే టీ స్నాక్. కాగా ఇది 65 ఏళ్లు పైబడిన వారి నిష్పత్తి కంటే రెట్టింపు. ఇక రెండో స్థానంలో సమోసా ఉంది. యూకేలోని దాదాపు ఎనిమిది శాతం మంది యూత్ టీతో రుచికరమైన భారతీయ చిరుతిండిని ఎంచుకున్నారు. కానీ 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ అలవాటు లేదు.

అయితే గ్రానోలా బార్‌తో పోలిస్తే.. సమోసాను ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది సర్వే. టీ అండ్ సమోసా కాంబినేషన్.. ప్రయాణాల్లోని పలు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఒక కప్పు టీ వివిధ రకాల సానుకూల భావోద్వేగాలను కలిగిస్తుంది. గత ఏడాది ఆగస్టు - అక్టోబర్ మధ్య కాలంలో సుమారు 2,000 మంది చాయ్ ప్రియులను ఇంటర్వ్యూ చేసిన పరిశోధకులు.. యూత్ టీతో పాటు బిస్కెట్స్‌ను చేర్చకపోతే సదరు బిజినెస్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: కాళ్లు, చేతులే కాదు.. అన్ని అవయవాలను తిరిగి పొందుతున్న స్పైడర్స్


Next Story

Most Viewed