దోమల బెడద నివారణకు చక్కటి పరిష్కారం.. ఇంటిముందు ఈ మొక్కలు నాటితే చాలు!

by Javid Pasha |

దోమల బెడద నివారణకు చక్కటి పరిష్కారం.. ఇంటిముందు ఈ మొక్కలు నాటితే చాలు!

దోమల బెడద నివారణకు చక్కటి పరిష్కారం.. ఇంటిముందు ఈ మొక్కలు నాటితే చాలు!
X

దిశ, ఫీచర్స్ : దోమలు.. అనేక రోగాల వ్యాప్తికి కారణం అవుతుంటాయి. ఈరోజుల్లో అయితే సీజన్‌తో సంబంధం లేకుండానే వీటి బెడద పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం, రోడ్లపై మురుగు పారడం, నీళ్లు నిలువడం వంటివి వీటి సంఖ్య మరింత పెరగడానికి దారితీస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దోమలను తరమేందుకు తరచుగా ఆల్ ‌ఔట్, కాయిల్స్ వంటివి వాడుతుంటారు. అవి పెద్దగా ప్రభావం చూపకపోగా, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని రకాల మొక్కలు మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పెరట్లోనో, పరిసరాల్లోనో పెంచడంవల్ల వాటిని దోమలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

పుదీనా, లావెండర్

ఇవి సువాసనగల మొక్కలు. దీవీటిని ఇంటిముందు, చుట్టుపక్కల పరిసరాల్లో పెంచడంవల్ల దోమలు రాకుండా ఉంటాయని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. పుదీనా మొక్క మంచి క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. ఇంటి ముందు కుండీల్లో పుదీనా మొక్కలు పెంచినట్లయితే ఇంటి అవసరాలకు ఉపయోగపడటమేగాక, వివిధ రోగాలకు కారణమయ్యే దోమలు రాకుండా ఉంటాయి.

రోజ్మెరి, తులసీ

రోజ్మెరీ, తులసీ మొక్కలు ఉన్న పరిసరాల్లోకి కూడా దోమలు రావడానికి ఇష్ట పడవు. రోజ్మెరీ ఇంటి అందాన్ని, అలంకారాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో నాటుతుంటారు. అంతేగాకుండా ఇది దోమలు రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే దీని నుంచి వెలువడే వాసనను అవి తట్టుకోలేవు. ఇక తులసీ మొక్క గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలో దీనిని పవిత్రమైనదిగా భావిస్తూ పూజిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగుండటమేగాక, దానివాసన కారణంగా దోమల నివారణిగా కూడా పనిచేస్తుంది.

Next Story