- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: 'హల్లో తెలుగు ఫ్యాన్స్.. నేను హైదరాబాద్ వచ్చేసాను'.. రోహిత్ శర్మ క్యూట్ వీడియో
Viral Video: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముంబై ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఎయిర్ పోర్టులో దిగగానే ఫ్యాన్స్ సందడి చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కనిపించగానే ముంబై కా రాజా..రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేశారు. కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. హై సెక్యూరిటీ ఉండటంతో అభిమానుల ఆశలు అడియాసలు అయ్యాయి.
ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టిన హైదరాబాద్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ముంబై పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే 7 మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం రెండు మాత్రమే గెలిచింది. అటు ముంబై వరుస విజయాలతో ఊపుమీదున్నది. ఈ మ్యాచులో ఓడితే హైదరాబాద్ ఇంటిబాట పట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే గెలవాలని ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హల్లో తెలుగు ఫ్యాన్స్..నేను హైదరాబాద్ వచ్చేసాను అంటూ అభిమానులకు షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Shana 💙🤣 pic.twitter.com/O1YpcWfBh4
— 𝐑𝐢𝐩𝐩𝐞𝐫 𝐑𝐞𝐝𝐝𝐢𝐞 🦁 (@Ripper_Reddie) April 22, 2025






