- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Chahal-Mahavash: మామూలోడివి కాదు నువ్వు..చాహల్ కోసం ఈ ముద్దుగుమ్మ ఏం పోస్టు పెట్టిందో తెలిస్తే!

దిశ, వెబ్ డెస్క్: Chahal-Mahavash: లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో డేటింగ్ వార్తల వేళ రేడియో జాకీ మహ్ వశ్ చేసిన పోస్ట్ మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంది. మంగళవారం కోల్ కతాతో జరిగిన మ్యాచులో ఈ పంజాబ్ బౌలర్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం చాహల్ ను ప్రశంసిస్తూ మహ్ వశ్ తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్టును చేసింది. అతనితో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసిన ఆమె నీ టాలెంట్ మామూలుగా లేదు. అందుకే ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు సాధించావ్. అసంభవ్..అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులను చాహల్, మహ్ వశ్ కలిసి వీక్షించిన విషయం తెలిసిందే. దీంతో వీరు ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు మొదలవగా..ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు. అయితే ఈ మధ్య చాహల్ ఆడుతున్న ఐపీఎల్ మ్యాచులకు మహ్ వశ్ వచ్చి గ్యాలరీలో సందడి చేస్తోంది. ఇటీవల అతడితో తీసుకున్న సెల్ఫీని పోస్టు చేసిన ఆమె. ఇది నీ వాళ్లకు అన్నివేళలా మద్దతుగా నిలుస్తూ ..వారి వెనక ద్రుఢంగా నిలుస్తుందనకు నీకోసం మేమందరం ఉన్నామంటూ కామెంట్ చేసింది. దీనికి చాహల్ స్పందిస్తూ..మీరు నా వెన్నెముక. నేను ఎంతో ఉన్నతస్థాయిలో నిలిచేందుకు సహకరిస్తున్న మీకందరికీ క్రుతజ్ణతలు అని రాసుకొచ్చాడు. దీంతో వీరి ప్రేమ బంధం నిజమేనేమో అంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక చాహల్ ఈమధ్యే న భార్య ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం కోల్ కతా పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ చెలరేగిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపుతిపాడు. దీంతో పంజాబ్ తన 111పరుగులు స్వల్ప స్కోరును కాపాడుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.