అక్కడ పుట్టుమచ్చ ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే.. భర్తకు ఆ విషయంలో తిరుగే ఉండదంట!

by Disha Web Desk 8 |
అక్కడ పుట్టుమచ్చ ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే.. భర్తకు ఆ విషయంలో తిరుగే ఉండదంట!
X

దిశ, ఫీచర్స్ : సాముద్రిక శాస్త్రంలో పుట్టు మచ్చలు వాటి ఫలితాల గురించి తెలియజేయడం జరిగింది. శరీరంలోని వివిధ భాగాలపై పుట్టు మచ్చలు ఉండటం వలన అదృష్ట, దురదృష్టాల గురించి తెలుసుకోవచ్చు అంటారు. ప్రతీ ఒక్కరి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్ర పోషిస్తాయి. పుట్టుమచ్చల ఫలితాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే వీటిని కొంత మంది నమ్మితే, మరికొంత మంది కొట్టిపారేస్తారు.ఇక స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆ స్థానంలో పుట్టుమచ్చ ఉండటం వలన తన భర్తకు అష్టైశ్వర్యాలు కలుగుతాయంట.

మహిళలకు ముఖంపై పుట్టుమచ్చ ఉంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా గడ్డంపై పుట్టు మచ్చ ఉన్న స్త్రీలు బ్యూటీఫుల్‌గా కనిపిస్తారు. అంతే కాకుండా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్న మహిళను చేసుకున్నవారికి ధనాభివృద్ధి చెందడంలో తిరుగే ఉండదంట. . సంపాదన పెరిగి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారంట.

Next Story

Most Viewed