జ్ఞాపకాలనూ చెరపొచ్చు.. ‘ఆప్టోజెనెటిక్స్’తో సాధ్యమేనంటున్న నిపుణులు

by Javid Pasha |

ఆప్టోజెనెటిక్స్ టెక్నాలజీ నుంచి వెలువడే నీలికాంతి మెదడు భాగంలోని ‘స్పైన్స్‌’ను చిన్నదిగా మార్చి, జ్ఞాపకాలకు కారణమైన సమీప నరాలను ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపకాలను మార్చివేసినట్లు పరిశోధకులు గుర్తించారు.

జ్ఞాపకాలనూ చెరపొచ్చు.. ‘ఆప్టోజెనెటిక్స్’తో సాధ్యమేనంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : మానవ జీవితంలోని అనేక అనుభవాలు మెదడులో జ్ఞాపకాలుగా నిక్షిప్తం అవుతుంటాయి. అవసరమైనప్పుడు వాటిని గుర్తుచు తెచ్చుకుంటూ ఉంటాం. లేదా సందర్భానుసారంగా వాటంతట అవే ప్లే అవుతూ.. వాటి తాలూకు భాననలకు సంబంధించిన ఏదో ఒక అనుభూతికి లోను చేస్తుంటాయి. జ్ఞాపకాల్లోనూ పలు రకాలుంటాయి. మధురమైనవే కాకుండా అత్యంత బాధాకరమైనవి కూడా కావచ్చు. కాగా విషాదకరమైన జ్ఞాపకాలు గుర్తుకు రావడం వల్ల కొందరు మరింత స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యను ఎదుర్కోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టే ఒక అద్భుతమైన ‘ఆప్టోజెనెటిక్స్ బ్లూ లైట్ టెక్నాలజీ’ని జపనీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మెదుడులోని జ్ఞాపకాలను తొలగించే పరిశోధోనలో భాగంగా టోక్యో యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ల్యాబ్‌లో ఎలుకలపై పలు ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆప్టోజెనెటిక్స్ టెక్నాలజీ నుంచి వెలువడే నీలికాంతి మెదడు భాగంలోని ‘స్పైన్స్‌’ను చిన్నదిగా మార్చి, జ్ఞాపకాలకు కారణమైన సమీప నరాలను ప్రభావితం చేసి, భద్రపర్చుకున్న లేదా నేర్చుకున్న జ్ఞాపకాలను మార్చివేసినట్లు గుర్తించారు. అయితే ఇది కేవలం 10-20 % న్యూరాన్లను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి మెదడులోని మిగతా జ్ఞాపకాలకు ఎటువంటి హాని జరగకుండా బాధాకరమైన లేదా అవసరం లేని వాటిని తొలగించచ్చునని పరిశోధకులు నిర్ధారించారు. కాగా ప్రస్తుతం ఈ సాంకేతికత మానవులపై ప్రయోగించలేదు. కానీ ఇక్కడ కూడా ఆప్టోజెనెటిక్స్ బ్లూ లైటింగ్ టెక్నాలజీ జ్ఞాపకాలను తొలగించడంలోనూ సహాయపడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ భవిష్యత్తులో ట్రామా పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్(PTSD) వంటి సమస్యలకు కొత్త చికిత్సలను కనుగొనడంలోనూ సహాయపడుతుందని చెబుతున్నారు.

Next Story