Anti aging : వృద్ధాప్యం రాకుండా అడ్డుకోవచ్చు..! డైలీ కప్పు కాఫీతో..

by Javid Pasha |

Anti aging : వృద్ధాప్యం రాకుండా అడ్డుకోవచ్చు..! డైలీ కప్పు కాఫీతో..

Anti aging : వృద్ధాప్యం రాకుండా అడ్డుకోవచ్చు..! డైలీ కప్పు కాఫీతో..
X

దిశ, ఫీచర్స్ : కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదని కొందరు, మంచిది కాదని కొందరు చెబుతుంటారు. ఇక మితంగా తాగితే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని, మోతాదుకు మించితే అది పెరుగుతుందని కూడా గత అధ్యయనాలు పేర్కొన్నాయి. కాగా లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం మాత్రం మీరు ఆశ్చర్యపోయే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కాఫీ తాగేవారు తమ రియల్ ఏజ్ కంటే కూడా చిన్న వయసువారిలా కనిపించే అవకాశం ఉందని తెలిపింది. కెఫిన్ (Caffeine)లోని యాంటీ ఏజింగ్ సమ్మేళనాలే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఆ సమ్మేళనాలు ఏమిటి? వృద్ధాప్యాన్ని ఎలా అడ్డుకుంటాయో పరిశీలిద్దాం.

కాఫీలోని కెఫిన్ యాక్టివ్‌నెస్ పెంచుతుందని మాత్రం అందరికీ తెలిసిందే. కానీ ఇందులో వృద్ధాప్యాన్ని అడ్డుకోగల మరో సమ్మేళనం ఉందని కూడా పరిశోధకులు ఇటీవల గుర్తించారు. దీనినే ‘అడెనోసిన్ మోనోఫాస్ఫేట్-యాక్టివేటెడ్ ప్రోటీన్ కినేస్(AMPK)’గా అని పిలుస్తు్న్నారు. ఇది కణాల ఎనర్జీ బ్యాలెన్సింగ్‌లో కీ రోల్ పోషించే ఒక ముఖ్యమైన ఎంజైమ్. కణంలో శక్తి స్థాయిలు తగ్గినప్పుడు ఇది యాక్టివేట్ అయి శక్తి ఉత్పత్తిని పెంచడానికి, దీని వినియోగాన్ని తగ్గించడానికి వివిధ జీవక్రియ మార్గాలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా శక్తివంతమైన కణాల మరమ్మత్తు విధానాలను (powerful repair mechanisms) ప్రేరేపిస్తుంది. దీంతో శరీంలో డీఎన్ఏ‌ రిపేర్‌ను మెరుగు పర్చడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడం, అసాధారణ కణ వృద్ధిని నియంత్రించడం వంటి పనులను చేస్తుంది.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు మానవ కణాలను పోలిన ఫిషన్ ఈస్ట్‌(Fission East)పై జరిపిన ప్రయోగాలలో, రెండు నుంచి మూడు ఎస్ప్రెస్సో షాట్‌(Espresso shot)లకు సమానమైన కెఫిన్ వినియోగం కణాల జీవనకాలాన్ని 24% వరకు పెంచింది. పైగా ఈ కణాలు నెమ్మదిగా వృద్ధాప్యం చెందడమే కాకుండా, జన్యు నష్టాన్ని తట్టుకునే శక్తిని కూడా పొందాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మానవులలో కూడా ఇదే సెల్యులార్ మార్గం(ame cellular pathway exists in humans as well) ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి దీనిని సహజంగా యాక్టివేట్ చేయగల మార్గాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇప్పుడు కాఫీ ఈ వృద్ధాప్య నిరోధక ఆవిష్కరణలో సెంటర్ పాయింట్‌గా నిలిచింది. కాగా ఈ కొత్త పరిశోధన రోజువారీ సహజ సమ్మేళనాలను ఉపయోగించి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించే ఉత్తేజకరమైన అవకాశాలపై ఆసక్తి రేకెత్తిస్తోందని పరిశోధకులు అంటున్నారు. బహుశా యవ్వన రహస్యం మీ కాఫీ కప్పులోనే దాగి ఉందేమో మరి!

Next Story