Baldness : బట్టతలకు ఇక శాశ్వత పరిష్కారం.. ఔషధ, చికిత్స రహిత పరిష్కారాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..!

by Javid Pasha |

Baldness : బట్టతలకు ఇక శాశ్వత పరిష్కారం.. ఔషధ, చికిత్స రహిత పరిష్కారాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..!

Baldness : బట్టతలకు ఇక శాశ్వత పరిష్కారం.. ఔషధ, చికిత్స రహిత పరిష్కారాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..!
X

దిశ, ఫీచర్స్ : బట్టతల.. ఇది అనారోగ్య సమస్య కాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కృంగదీస్తున్నది. ప్రజలు అందం, ఆహార్యానికి సంబంధించినదిగా భావిస్తున్నందున ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నవారు గిల్టీగా ఫీలయ్యే అవకాశం ఎక్కువ.ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు పురుషుల్లో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇటీవల 40 ఏండ్లు దాటిన స్త్రీలలో సైతం బట్టతల సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఒక తాజా పరిశోధన ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని గుర్తించింది. అదేంటో చూద్దామా!

ఒకప్పటిలా బట్టతల(Baldness) ఇక బాధించే సమస్యగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిశోధకులు దీనికి ఆశాజనకమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎలాంటి ఔషధాలు లేదా క్రీముల అవసరం లేకుండానే సహజమైన మార్గంలో దానిని నివారించవచ్చునని ఫ్రంటియర్స్ ఇన్‌ఫార్మకాలజీ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. దీని ప్రకారం.. డీఎన్ఏ(DNA) నిర్మాణంలో కీలకంగా ఉండే సహజ చక్కెర అయిన డియోక్సిరిబోస్ జుట్టు రాలడంలో సహాయపడుతుందని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉంది. మానవులకు వర్తింపజేయడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.

డియోక్సిరిబోస్ (Deoxyribose) అనే నేచురల్ షుగర్ జుట్టు కుదుళ్ల చుట్టూ రక్తనాళాల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా వెంట్రుకలు తిరిగి పెరగానికి సహాయపడుతున్నట్లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ ఆవిష్కరణ యాదృచ్ఛికంగా జరిగింది. నిజానికి శాస్త్రవేత్తలు మొదట డియోక్సిరిబోస్‌ను ఎలుకలలో గాయం నయం చేయడానికి పరీక్షిస్తున్నప్పుడు, చికిత్స చేసిన ప్రాంతాల సమీపంలో పూర్తిగా రాలిపోయిన జుట్టు వేగంగా తిరిగి పెరగడాన్ని గమనించారు.

పరిశోధనా క్రమంలో టెస్టోస్టెరాన్ వల్ల బట్టతల సమస్య ఉన్న ఎలుకలపై డియోక్సిరిబోస్‌ అనే చక్కెరను ప్రయోగించినప్పుడు కూడా జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమైంది. ఇది రోగైన్‌లోని యాక్టివ్ పదార్థం(active ingredient) మినాక్సిడిల్‌తో సమానమైన ఫలితాలను చూపించింది. కాబట్టి డియోక్సిరిబోస్ ఆధారిత ట్రీట్మెంట్ వంశపారంపర్య బట్ట తల సమస్యను నివారించడంలో విప్లవాత్మక పరిష్కారంగా మారే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.


Next Story