ఇతర గ్రహాలపై శబ్దాలు వినేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్..

by Disha Web Desk 10 |
ఇతర గ్రహాలపై శబ్దాలు వినేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్..
X

దిశ, ఫీచర్స్: భూమిపై వాతావరణం, వివిధ శబ్దాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కానీ ఈ ప్రపంచానికి వెలుపల ఇతర గ్రహాలపై ధ్వని లేదా శబ్దాలు ఉంటాయా? ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? అనేది ఇప్పటి వరకు తెలియదు. కానీ అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ద్వారా ఇప్పుడది సాధ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇతర గ్రహాలలోని శబ్దాలను రికార్డు చేసేందుకు దోహదం చేసే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను బ్రిటీష్ పరిశోధకుడు రూపొందించాడు. దీనిద్వారా సుదూర గ్రహాలపై మానవ స్వరాలు ఎలా మారవచ్చో తెలుసుకోవచ్చు. అంతేగాక ఇది గ్రహాంతర జీవితాన్వేషణకు సహాయపడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు.

‘‘దశాబ్దాలుగా మనం సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలకు కెమెరాలను పంపడం ద్వారా చాలా నేర్చుకున్నాం. అయినప్పటికీ అంగారుకుడు మొదలు ఇతర గ్రహాల్లో శబ్దాలు ఎలా ఉంటాయో వినలేదని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో(Southampton) అల్ట్రాసోనిక్స్ అండ్ అండర్ వాటర్ అకౌస్టిక్స్ ప్రొఫెసర్ తిమోతీ లైటన్ పేర్కొన్నారు. తాజాగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ గ్రహాంతర ధ్వనులు, గ్రహాంతర జీవుల అన్వేషణలో కూడా సహాయపడుతుందని ఆమె చెప్తున్నారు. అందుకు బృహస్పతి(Jupiter)కి చెందిన చంద్రుడు(యూరోపా)ని ఉదాహరణగా చూపుతున్నారు. ఈ గ్రహాల్లోని ఉపరితలంపై మంచుతో నిండిన షెల్ కింద, జీవానికి దోహదం చేసే సముద్రం ఉందని, దాని ధ్వనిని గ్రహాలపైకి రోవర్‌ను పంపినప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్ రికార్డు చేస్తుందని చెప్తున్నారు. ఇతర గ్రహాల నుంచి వచ్చే శబ్దాలను వినడం సైంటిఫిక్ బెనిఫిట్ అందించడమే కాదు, వినోదానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తున్నారు.

2005లో ఏం జరిగింది?

2005లో టైటాన్ వాతావరణంలోకి హ్యూజెన్స్ ల్యాండర్ దిగడం, ఇటీవలి మార్స్ ఇన్‌సైట్, మార్స్ 2020 మిషన్‌ల సమయంలో ధ్వని అధ్యయనాలు చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి. ఈ విజయవంతమైన మిషన్లలో చాలా తక్కువ పౌనఃపున్యాలు లేదా ఇన్‌ఫ్రా సౌండ్ నుంచి మానవ వినికిడి థ్రెషోల్డ్‌కు దిగువన, మానవ వినికిడి పైన అల్ట్రాసౌండ్ వరకు విస్తృత స్పెక్ట్రంలో పనిచేసే కస్టమ్ ఎకౌస్టిక్ సెన్సార్లు ఉన్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్ ప్లానిటోరియమ్స్, మ్యూజియమ్స్‌లో ఇతర గ్రహాల శబ్దాల అంచనాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. మార్స్ విషయంలో అమెరికన్-యూరోపియన్ నిపుణుల బృందం, చైనాకు చెందిన జురాంగ్ మిషన్(Zhurong mission) నుంచి వాస్తవ శబ్దాలను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.

అంగారక గ్రహంపై సౌండ్ రికార్డింగ్

2022లో అంగారక గ్రహంపై సరికొత్త మానవ నిర్మిత విజిటర్ రెడ్ ప్లానెట్ ఎలా ఉంటుందో, దాని గురించి మొదటి ఆధారాలను మానవులకు అందించింది. నాసా రూపొందించిన ఒక రోబోట్ మార్స్ మీద ధ్వని వాతావరణాన్ని సక్సెస్ ఫుల్‌గా రికార్డ్ చేసింది.

ప్రత్యేకంగా రూపొందించిన మైక్రోఫోన్‌ను ఉపయోగించి, రోవర్ మొదటిసారిగా మార్టిన్ గాలులను రికార్డ్ చేసింది. 20Hz మరియు 20 kHz మధ్య మానవజాతి ఎప్పుడైనా రెడ్ ప్లానెట్‌కు ప్రయాణిస్తే, శబ్దాలు మానవులకు వినిపించే స్పెక్ట్రమ్‌లో ఉన్నాయని పరిశోధకుల బృందం పేర్కొంది. ఇతర గ్రహాలపై వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందంటే.. మన గ్రహం మీద ధ్వని అవరోధం గంటకు 761 మైళ్లు అయితే, అంగారక గ్రహంపై గంటకు 537 మైళ్లు మాత్రమే. అంగారక గ్రహంపై ధ్వని వేగం ఇక్కడి కంటే చాలా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఈ గ్రహంపై మాట్లాడటానికి ప్రయత్నిస్తే, వారు ఒకరికొకరు 15 అడుగుల కంటే ఎక్కువ దూరంలో నిలబడితే అవతలి వ్యక్తి వినడం కష్టం.

Also Read..

నెగెటివ్ థాట్స్‌తో డిప్రెషన్.. జీవన శైలి మార్పులతో పరిష్కారం

Next Story

Most Viewed