- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Snail Robot : అచ్చం నత్తలా నడిచే చిన్ని రోబోట్.. ఇది చేసే పనులు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
నిజమైన నత్త మాదిరిగానే భూమిపైన, రాళ్లల్లోన, కొండలపైన, బురదలో, నీటిలో కదులుతూ వెళ్లగలిగే..‘స్నేయిల్ రోబోట్’ను పరిశోధకులు డెవలప్ చేశారు

దిశ, ఫీచర్స్ : చాలా వరకు హ్యూనాయిడ్ రోబోట్స్, వివిధ పనులకోసం తయారు చేసిన ప్రత్యేక రోబోట్స్ గురించి మీరు వినే ఉంటారు. కానీ హాంగ్‌కాంగ్ చైనీస్ యూనివర్సిటీలోని పరిశోధకులు నత్తను పోలి ఉండే సరికొత్త రోబోట్‌ను రూపొందించారు. ఇది హెల్మెట్ లాంటి ఆకారంగల షెల్‌తో కూడి ఉంటుంది. నిజమైన నత్త మాదిరిగానే భూమిపైన, రాళ్లల్లోన, కొండలపైన, బురదలో, నీటిలో కదులుతూ వెళ్లగలదు. కాబట్టి దీనిని ‘స్నేయిల్ రోబోట్’ లేదా స్నేయిల్-ఇన్‌స్పైర్డ్ రోబోటిక్ స్వార్మ్ అని పిలుస్తున్నారు. ఇందులో అమర్చబడిన ‘రీట్రాక్టబుల్ సక్షన్ కప్’ సదరు రోబోట్‌ను వివిధ పరిస్థితుల్లో ట్రైన్ లా కదలడానికి సహకరిస్తుంది.
ఇంతకీ స్నేయిల్ రోబోట్‌ను ఎందుకు తయారు చేశారంటే.. కొన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో, ఎత్తైన కొండ ప్రదేశాల్లో, సముద్ర పరిసరాల్లో, అడవుల్లో పరిశోధనలు కొనసాగించడానికి సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అక్కడికి పరిశోధకులు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు అక్కడి పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ నత్త లాంటి రోబోట్స్‌ను పంపిస్తారు. చూడ్డానికి చిన్నివిగానే ఉంటాయి కానీ ఈ రోబోట్స్ సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేస్తూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి అంటున్నారు వాటిని రూపొందించిన పరిశోధకులు. వాటి ఆకారం కారణంగా అవి అతి ప్రమాదకరమైన కొండ గుహల్లో, చెట్ల పొదల్లో, నీటి ప్రవాహ ప్రాంతాల్లో కూడా ప్రవేశించి, కదులుతూ అక్కడి పరిస్థితులను క్యాప్చర్ చేసి, విశ్లేషించి స్టోర్ చేసుకుంటాయి. ఆ సమాచారాన్ని అనుసంధానించబడిన డివైజ్‌కు చేరవేస్తాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆయా పరిస్థితుల్లో అధ్యయనాలు కొనసాగించడానికి సహకరిస్తాయి. Link






