- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూరాలజికల్ వ్యాధులకు కొత్త పరిష్కారం.. ‘సర్క్యులెట్రానిక్స్’ సాంకేతికత!
ఆరు సంవత్సరాల పరిశోధనల అనంతరం రీసెర్చర్స్ ఈ నరాల వ్యాధి చికిత్స కోసం ‘సర్క్యులెట్రానిక్స్’ను సాంకేతికతను డెవలప్ చేయగలిగారు.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమంది ఎదుర్కొంటున్న హెల్త్ ఇష్యూస్‌లో న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఒకటి. వీటిలో కొన్ని మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే చికిత్స చేసేటప్పుడు వైద్య నిపుణులు బ్రెయిన్ లోపలి భాగంలోని నరాలకు సైతం నిర్ధారించిన ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో, రిస్కుతో కూడినదిగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో అలాంటి పరిస్థితికి చెక్‌పెట్టే అద్భుత ఆవిష్కరణకు తెరతీశారు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) కి చెందిన పరిశోధకులు. ఏంటంటే.. సర్క్యులెట్రానిక్స్ (Circulatronics) అనే ఒక విప్లవాత్మక సాంకేతితను డెవలప్ చేశారు. ఇది మెదడుతో సంబంధం ఉన్న న్యూరాలాజికల్ వ్యాధులకు బయటి నుంచి జస్ట్ కేవలం ఒక ఇంజెక్షన్ ద్వారా చాలా సులభంగా చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
ఆరు సంవత్సరాల పరిశోధనల అనంతరం రీసెర్చర్స్ ఈ సర్క్యులెట్రానిక్స్‌ను డెవలప్ చేయగలిగారు. ఇందులో స్విచబుల్ వైర్‌లెస్ ఎలక్ట్రానిక్ డివైసెస్(SWEDs)అనే చిన్న వైర్‌లెస్ చిప్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవి ఈ చిప్‌లు ఆర్గానిక్ సెమీకండక్టింగ్ పాలిమర్ పొరలు, మెటాలిక్ పొరల మధ్య సాండ్‌విచ్ లాగా ఉంటాయి. ఇక స్విచబుల్ వైర్‌లెస్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఒక బియ్యపు గింజ పరిమాణంలో ఉండే నానోపార్టికల్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక దీని పనితీరు విషయానికి వస్తే చేతిలో సాధారణ ఇంజెక్షన్‌తో రక్త ప్రవాహంలో ఇమ్యూన్ సెల్స్ (మోనోసైట్స్) కలిసిపోతాయి. అవి మెదడు ప్రాంతంలో స్వయంగా ఇంప్లాంట్ అవుతాయి.
చికిత్సలో సర్క్యులెట్రానిక్స్ నియంత్రణ విషయానికి వస్తే బయటి నుంచి నియర్-ఇన్‌ఫ్రారెడ్ (NIR) కాంతితో వైర్‌లెస్‌గానూ ఆన్ చేయవచ్చు. నరాలకు ఎటువంటి హాని జరగదు. ఎలుకలపై ప్రయోగాల్లో సక్సెస్ అయిన సాంకేతికత మానవ శస్త్ర చికిత్సలకోసం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు, పరిశోధనలు కొనసాగుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. అవి కూడా విజయవంతం అయితే న్యూరాలాజికల్ శస్త్ర చికిత్సల్లో మరో అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చినట్టే. జస్ట్ ఒక్క ఇంజెక్షన్‌తో బ్రెయిన్ ట్యూమర్స్, అల్జీమర్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్(ultiple sclerosis), క్రానిక్ పెయిన్, ఇలా డిప్రెషన్ నుంచి బ్రెయిన్ క్యాన్సర్ వరకు అన్ని చికిత్సల్లో ఉపయోగకరంగా ఉంటుంది. Link






