AI-స్టెతస్కోప్.. 15 సెకన్లలో మీ గుండె పనితీరును గుర్తించేస్తుంది..!!

by Javid Pasha |   (  Updated:2025-09-23 07:39:09  IST  )

వైద్య రంగంలో ఏఐ (AI) ఆధారిత స్టెతస్కోపు మరో గొప్ప పురోగతిగా వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కేవలం 15 సెకన్లలో గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను గుర్తించగలదు.

AI-స్టెతస్కోప్.. 15 సెకన్లలో మీ గుండె పనితీరును గుర్తించేస్తుంది..!!
X

దిశ, ఫీచర్స్ : మీరు హాస్పిటల్ వెళ్లినప్పుడు గమనించే ఉంటారు. డాక్టర్లు ముందుగా స్టెతస్కోప్‌తో పేషెంట్ల గుండె చప్పుడు వినడం ద్వారా హార్ట్ రేట్‌ను అంచనా వేస్తారు. ఊపిరితిత్తులు, ఇతర అవయవాల శబ్దాలను వినడంలో కూడా ఈ స్టెతస్కోప్‌ సహాయపడుతుంది. ప్రధానంగా గుండె సమస్యలు, శ్వాసకోశ వ్యాధులను గుర్తించడంలో కీ రోల్ పోషిస్తుంది. అయితే ప్రస్తుతం ఏఐ ఆధారిత స్టెతస్కోప్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది సాధారణ స్టెతస్కోప్‌ల కంటే సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వైద్య రంగంలో ఏఐ (AI) ఆధారిత స్టెతస్కోపు మరో గొప్ప పురోగతిగా వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం 15 సెకన్లలో గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను గుర్తించగలదు. సాంప్రదాయ స్కాన్‌ల కంటే కూడా వేగంగా విశ్లేషించడంలో సహాయపడగలదు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ సాంకేతికత వైద్య పరీక్షలలో విప్లవాత్మక మార్పులను తీసుకు రాగలదని నిపుణులు అంటున్నారు. అయితే ఇది కేవలం వైద్యులు మాత్రమే కాకుండా, సాధారణ వ్యక్తులు కూడా ఉపయోగించి తమ హార్ట్ రేట్‌ను, అవయవాల పనితీరును తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ సరికొత్త ఏఐ స్టెతస్కోప్ వైద్య రంగంలోనే, కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని చోట, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Link

Next Story