- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Marine oxygen : చెట్లు మాత్రమే ఆక్సిజన్ ఇస్తాయనుకోకండి..! అంతకు మించి ఇవి కూడా..!
Marine oxygen : చెట్లు మాత్రమే ఆక్సిజన్ ఇస్తాయనుకోకండి..! అంతకు మించి ఇవి కూడా..!

దిశ, ఫీచర్స్ : ఈ భూమిపై ఆక్సిజన్ ఎలా లభిస్తుంది? ఇంకెలా? చెట్లు, అడవులవల్లే కదా అంటుంటారు చాలా మంది. కానీ అంతకు మించి ఈ వాయువును విడుదల చేసే వనరులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేవో కాదు, సముద్రాలు. మనం శ్వాసించే ఆక్సిజన్‌లో 80 శాతం వరకు వీటి ద్వారానే లభిస్తుందని, సముద్రాల్లోని ఫైటో ప్లాంక్టన్ వంటి సూక్ష్మజీవులే ఇందుకు ప్రధాన కారణమని నాసా, నేషనల్ ఓషనోగ్రఫిక్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) పరిశోధనలు పేర్కొంటున్నాయి.
పరిశోధనల ప్రకారం.. సముద్రాల్లోని ఫైటోప్లాంక్టన్(Phytoplankton), సైనో బ్యాక్టీరియా(Cyanobacteria), సముద్ర పాచి(Seaweed) వంటి సూక్ష్మ జీవులు ఆక్సిజన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిన్న చిన్న జీవులు సముద్ర ఉపరితలంపై తేలుతూ.. సూర్యకాంతిని ఉపయోగించుకొని ఫొటోసింథెసిస్ ప్రాసెస్(Photosynthesis process) ద్వారా ఆక్సిజన్(Oxygen)ను ప్రొడ్యూస్ చేసి, రిలీజ్ చేస్తాయి. అంతేకాదు ఇవి కార్బన్ డై ఆక్సైడ్(Carbon dioxide)ను గ్రహించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం విశేషం. భూమిపై మానవులు, ఇతర జీవుల మనుగడకు ఈ ప్రక్రియ చాలా అవసరం అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఫైటో ప్లాంక్టన్ సూక్ష్మ జీవులు సముద్రాల్లోనే అత్యధికంగా ఉండటంవల్ల చెట్లతో పోలిస్తే(Compared to trees) ఇక్కడే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. అమెజాన్ వంటి అడవులు (Forests like the Amazon) ఆక్సిజన్ ఉత్పత్తిలో ముఖ్యమైనవే, అయినప్పటికీ అవి సుమారు 20% ఆక్సిజన్‌ను మాత్రమే అందిస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పైగా భూమిలో 71% వైశాల్యంలో సముద్రాలే విస్తరించి ఉండటం, ఫైటోప్లాంక్టన్ వంటి సూక్ష్మ జీవులకు నిలయంగా మారడం కారణంగా అడవులకంటే కూడా ఎక్కువగా (80 %) ఆక్సిజన్ ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. సముద్ర ఆహార గొలుసులోనూ ఫైటోప్లాంక్టన్ సూక్ష్మ జీవులు(Phytoplankton microscopic organisms) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇవి ఇతర సముద్ర జీవులకు ఆహార వనరులుగా ఉపయోగపడతాయి.






