- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్‌ను డెవలప్ చేస్తున్న పరిశోధకులు.. పరికరాల మన్నికలో కీ రోల్!
పరిశోధకులు చాలాకాలంగా సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ తయారీపై పనిచేస్తున్నారు. పరికరాల నాణ్యతలో ఇది కీ రోల్ పోషిస్తోంది.

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్‌లోనో, స్మార్ట్ వాచ్‌లోనో ఏదైనా చిన్న సమస్య తలెత్తితే.. అది పనిచేయడం ఆగిపోతే.. రిపేర్ షాప్‌కో, సర్వీసింగ్ సెంటర్‌కో వెళ్లాల్సి వస్తుంది. ఇవే కాదు వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌ల పరిస్థితి కూడా అంతే. అయితే ఈ సమస్యకు మానవ అవసరాన్ని చాలా వరకు తగ్గించే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొనడంపై పరిశోధకులు చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా స్వయంగా- సరిచేసుకునే(Self-Healing) మెటీరియల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆయా వస్తువులు, పరికరాలు భౌతికంగా దెబ్బతిన్నప్పటికీ ఎలక్ట్రిక్ కనెక్షన్లను స్వయంగా పునరుద్ధరించగలదు. ఈ టెక్నాలజీ సాధారణంగా ఫ్లెక్సిబుల్ పాలిమర్లను ఉపయోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధకులు అభివృద్ధి చేసిన సెల్ఫ్-హీలింగ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఆయా పరికరాల్లో క్రాక్స్, స్క్రాచ్‌లు, స్ట్రెస్ వంటి ఎలక్ట్రికల్ కనెక్షన్లను స్వయంగా పునరుద్ధరిస్తాయి. వాటిలో కండక్టివ్ పార్టికల్స్ లేదా మైక్రోక్యాప్సూల్స్ (రిపేర్ ఏజెంట్స్ ఉన్న చిన్న క్యాప్సూల్స్) ఎంబెడ్ చేస్తారు. కాబట్టి సర్క్యూట్ బ్రేక్ అయినప్పుడు మెటీరియల్ స్వయంగా కనెక్షన్‌ను పునరుద్ధరించుకుంటుంది లేదా రసాయనాలను విడుదల చేసి కండక్టివ్ స్ట్రక్చర్‌ను తిరిగి నిర్మిస్తుంది. ఇలా పరికరాలు దెబ్బతిన్నా పని చేస్తూనే ఉంటాయి.
వేరబుల్ టెక్నాలజీలో మార్పులు
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సహా ప్రపచంలో అనేక మంది పరిశోధకులు ఎక్కడికక్కడ సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ తయారీపై పనిచేస్తున్నట్లు సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ సాంకేతికత వేరబుల్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఏరోస్పేస్ సిస్టమ్స్, ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలు వంటి రంగాల్లో చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇది అందుబాటులోకి వస్తే భారీ మార్పు తీసుకురావచ్చునని కూడా చెబుతున్నారు. ఆయా పరికరాల్లో, నిరంతరం బెండింగ్ లేదా మెకానికల్ స్ట్రెస్‌కు గురయ్యే పరికరాలు, యంత్రాలు ఇప్పటికంటే చాలా ఎక్కువ కాలం మన్నికగా ఉండటంలో సహాయపడుతుంది.
జీవితకాలం పెరుగుతుంది..
రిమోట్ లేదా ప్రమాదకర ప్రాంతాల్లో సాటిలైట్లు, మెడికల్ ఇంప్లాంట్స్, డీప్-సీ సెన్సార్లు వంటివి రిపేర్ చేయడం కష్టం కాబట్టి, సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ ఇలాంటప్పుడు విశ్వసనీయతను పెంచుతాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ వేస్ట్ తగ్గించి, పరికరాల జీవితకాలాన్ని పొడిగించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తు్న్నారు. ప్రస్తుతం ఇవి ల్యాబ్ దశలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, భవిష్యత్తులో రోజువారీ ఉపయోగాల్లో (స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌లు, ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్) కీలంగా మారనున్నాయని, సాంకేతిక అవసరాల్లో, వినియోగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఆవిష్కరణలు మనం ఉపయోగించే టెక్నాలజీని మరింత బలమైనదిగా మార్చి, సస్టైనబుల్ చేసి, ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్‌ను తగ్గిస్తుంది.
ప్రయోజనాలు
* సెల్ఫ్-హీలింగ్ మెటీరియల్స్ నిరంతరం బెండింగ్, స్ట్రెస్ లేదా డ్యామేజ్‌కు గురయ్యే డివైజుల్లో చాలా ఉపయోగపడతాయి
*వేరబుల్ టెక్నాలజీ: స్మార్ట్‌వాచ్‌లు, ఫ్లెక్సిబుల్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ స్కిన్ (e-skin), హెల్త్ మానిటరింగ్ ప్యాచ్‌లు.
* రోబోటిక్స్: సాఫ్ట్ రోబోట్ చేతులు, ఫ్లెక్సిబుల్ రోబోట్ సర్క్యూట్లు, బెండింగ్ తర్వాత కూడా పని చేస్తాయి.
* ఏరోస్పేస్ & స్పేస్: శాటిలైట్లు, డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ కాంపోనెంట్స్, రిపేర్ చేయడం కష్టమైన ప్రాంతాల్లో ఉపయోగపడతాయి.
* ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలు & ఎలక్ట్రానిక్స్: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లు, ఫ్లెక్సిబుల్ సెన్సర్లు, టచ్ ప్యానెల్స్ ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
*మెడికల్ ఇంప్లాంట్స్: హార్ట్ పేస్‌మేకర్లు, బయోసెన్సర్లు, శరీరంలో దెబ్బతిన్నా సరిచేసుకుంటాయి. అలాగే డీప్-సీ సెన్సర్లు, బ్యాటరీలు, కెపాసిటర్లు వంటి ఎనర్జీ స్టోరేజ్‌లలో ఉపయోగం. సాఫ్ట్ రోబోటిక్స్, ఇ-వేస్ట్ తగ్గించడానికి సహాయపడతాయి.






