Dress sense : ఇది తెలుసా..? ధరించే దుస్తులు కూడా మీ మెదడు పనితీరును మార్చేస్తాయ్..!

by Javid Pasha |   (  Updated:2025-06-05 08:02:34  IST  )

Dress sense : ఇది తెలుసా..? ధరించే దుస్తులు కూడా మీ మెదడు పనితీరును మార్చేస్తాయ్..!

Dress sense : ఇది తెలుసా..? ధరించే దుస్తులు కూడా మీ మెదడు పనితీరును మార్చేస్తాయ్..!
X

దిశ, ఫీచర్స్ : ధరించే దుస్తులు కూడా సదరు వ్యక్తుల మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి, హుందా తనానికి అద్దం పడతాయని చెబుతుంటారు నిపుణులు. అందుకే ఇంటర్వ్యూకో, ఉద్యోగానికో వెళ్లే ముందు ఫలానా టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలని సూచిస్తుంటారు. బహుశా యూనిఫాం కోడ్ కూడా అందుకే అమలు చేస్తుంటారు. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని కూడా వెల్లడించింది. వేసుకునే డ్రెస్సు మీ మెదడు పనితీరును కూడా మార్చేయగలదని పేర్కొన్నది. అదెలాగో చూద్దాం.

*జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ సోషల్ సైకాలజీ(Journal of Experimental Social Psychology)లో పబ్లిషైన అధ్యయన వివరాల ప్రకారం పరిశోధకులు, డాక్టర్లు ధరించే ఒక సాధారణ ల్యాబ్ కోట్ కేవలం స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా వారు చేసే పనిపై మరింత శ్రద్ధను, ఆసక్తిని, మానసిక పనితీరును మెరుగు పరుస్తుంది. ఇది ‘‘ఎన్‌క్లోత్‌డ్ కాగ్నిషన్’’ (Enclothed Cognition) అనే సైంటిఫిక్ కాన్సెప్ట్(scientific concept)పై ఆధారపడి ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

*2012లో నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో హాజో ఆడమ్ అండ్ ఆడమ్ గలిన్‌స్కీ (Hajo Adam and Adam Galinsky) నిర్వహించిన అధ్యయనం కూడా ధరించే దుస్తులు మెదుడు పనితీరును మెరుగు పరిచే కాన్సెప్ట్‌ను పాపులర్ చేసింది. పరిశోధనలో భాగంగా వారు అనేకమందిని అబ్జర్వ్ చేయగా, ల్యాబ్ కోట్(lab coat) ధరించినప్పుడు సదరు వ్యక్తుల ఫోకస్, కచ్చితత్వం (Focus and precision) మరింత ఎక్కువగా మెరుగు పడినట్లు కనుగొన్నారు.

*ముఖ్యంగా స్ట్రూప్ టెస్ట్ (Stroop test) వంటి మెంటల్ టాస్క్‌లలో ల్యాబ్ కోట్(lab coat) సానుకూల ప్రభావం చూపింది. అంటే దీనిని ధరించడం వల్ల శాస్త్రవేత్త, పరిశోధకుడు లేదా డాక్టర్‌తో వృత్తితో సంబంధం ఉన్న లక్షణాలు, అంటే శ్రద్ధ, కచ్చితత్వం ప్రొఫెషనలిజం వంటి భావనలు మెదడులో యాక్టివేట్ అవుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

*మొత్తానికి దుస్తులు మనలోని నిర్దిష్ట గుణాలను ఉత్తేజపరిచే సామర్థ్యం కలిగి ఉంటాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆర్మీ, పోలీస్, డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇలా ప్రొఫెషన్‌ను బట్టి డ్రెస్ కోడ్ నిర్ణయించడానికి కూడా కారణం ఇదే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫార్మల్ దుస్తులు ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మక దుస్తులు(Creative clothing) స్వేచ్ఛగా ఆలోచించడాన్ని (Freedom of thought) ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Next Story