ఆ విషయంలో అద్భుతం చేస్తున్న మ్యాజిక్ మష్రూమ్స్‌.. మానసిక ఆరోగ్య చికిత్సల్లోనూ ఉపయోగం..!

by Javid Pasha |   (  Updated:2025-10-03 05:59:00  IST  )

మ్యాజిక్ మష్రూమ్స్‌లోని సైలోబిన్ అనే సమ్మేళనం మెంటల్ హెల్త్ చికిత్సల్లో ఉపయోగపడుతుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

ఆ విషయంలో అద్భుతం చేస్తున్న మ్యాజిక్ మష్రూమ్స్‌.. మానసిక ఆరోగ్య చికిత్సల్లోనూ ఉపయోగం..!
X

దిశ, ఫీచర్స్ : పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. వీటిలోనూ పలు రకాలుంటాయి. అయితే మ్యాజిక్ మష్రూమ్స్ (Magic mushrooms) మాత్రం మానసిక ఆరోగ్యం విషయంలో అద్భుతం చేస్తాయని, ఆరోగ్య చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. వీటిని తినడంవల్ల మాత్రమే కాదు, చికిత్సల్లో ఉపయోగించడంవల్ల మెదడు సంబంధిత రుగ్మతలతోపాటు డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయని పరిశోధకులు అంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా మ్యాజిక్ మష్రూమ్స్‌లోని సైలోబిన్ (Psilocybin) అనే సమ్మేళనం మెంటల్ హెల్త్ చికిత్సల్లో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి నియంత్రిత వాతావరణంలో (controlled environment) తీసుకున్న సైలో సైబిన్ డోస్, కొన్ని సందర్భాల్లో ఐదేండ్ల వరకు డిప్రెషన్, అలాగే ఆందోళన లక్షణాలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడిందని అధ్యయనాలు, పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఇది మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. దీంతో ప్రతికూల ఆలోచనా విధానాల(Negative thinking patterns)ను విడదీసేందుకు సహాయపడుతుంది. అలాగే ఇది సెరోటోనిన్ రిసెప్టర్ల (5-HT2A)తో బంధిస్తూ మానసిక స్థితిని నియంత్రించి, భావోద్వేగ సౌలభ్యాన్ని(Emotional flexibility) మెరుగుపరుస్తుంది.

డిప్రెషన్, ఆందోళన వంటి చికిత్సల్లో రోజువారీ యాంటిడిప్రెసెంట్స్‌తో పోలిస్తే, మ్యాజిక్ మష్రూమ్స్‌లోని సైలోసైబిన్ ఒకటి లేదా రెండు నియంత్రిత డోస్‌ల(controlled doses)లో పనిచేయడం దీని ప్రత్యేక లక్షణంగా పరిశోధకులు పేర్కొన్నారు. అయితే సైలోబిన్ వాడకం పలు దేశాల్లో చట్ట విరుద్ధం కాబట్టి, దీనిని కేవలం క్లినికల్ ట్రయల్స్, వైద్యపరమైన అంశాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. తాజా పరిశోధన మానసిక ఆరోగ్యం విషయంలో మరిన్ని మెరుగైన చికిత్సలకు మార్గం చూపుతుందని అంటున్నారు.

Next Story