ఈ చిన్న టిప్ పాటిస్తే 206% కోటీశ్వరులు అయిపోవచ్చు..

by Disha Web Desk 9 |
ఈ చిన్న టిప్ పాటిస్తే 206% కోటీశ్వరులు అయిపోవచ్చు..
X

దిశ, ఫీచర్స్: చిన్న విషయాలు జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతాయని సామాజిక-ఆర్థికవేత్త రాండాల్ బెల్ చేసిన అధ్యయనంలో తేలింది. 5000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు, బిలియనీర్లతో సహా అన్ని రంగాలకు చెందిన వ్యక్తులపై 25 ఏళ్లు స్టడీ చేసిన ఆయన ఈ విషయాన్ని గుర్తించాడు. థాంక్స్ నోట్ రాయడం నుంచి కుటుంబంతో కలిసి భోజనం చేయడం వరకు రోజూవారి అలవాట్లను పరిశీలించి.. వీటిలో రిచ్ హ్యాబిట్స్ గురించి ' Me We Do Be ' అనే తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

ఇక వీటిలో ఫస్ట్ రిచ్ హ్యాబిట్ త్వరగా నిద్రలేవడం, బెడ్ సర్దడం అని తెలిపిన బెల్.. ఈ అలవాటు ఉన్నవారు 206.8% లక్షాధికారులుగా ఉంటారని వివరించాడు. ఈ అలవాటు సానుకూల మనస్తత్వం సృష్టించడంతో పాటు టోటల్ డేను మెరుగ్గా మారుస్తుంది. వర్క్ ప్రారంభానికి కనీసం మూడు గంటల ముందు నిద్ర లేవడం.. జీవితంపై నియంత్రణను పొందేందుకు హెల్ప్ చేస్తుంది. ఇక ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు అందరూ.. వ్యాయామం కోసం సమయం వెచ్చిస్తున్నారు. ఫిట్‌గా ఉండటం ద్వారా ఖచ్చితంగా రెండు రెట్లు ఎక్కువ విజయం సాధించవచ్చు. నిజంగా మల్టీ మిలియనీర్ అయ్యే అవకాశాలను పెంచుకోవాలనుకుంటే.. బుక్ రీడింగ్, శృంగార సంబంధానికి సమయాన్ని, శక్తిని కేటాయించాలని తెలిపాడు బెల్.



Next Story

Most Viewed