Health : లాలాజలంలో యాంటీ సెప్టిక్ గుణాలు.. గాయాలను మాన్పడంలో కీ రోల్ పోషిస్తుందంటున్న నిపుణులు

by Javid Pasha |   (  Updated:2025-09-17 06:28:40  IST  )

నోటిలో సహజంగా స్రవించే లాలాజలంలో హిస్టాటిన్స్ అనే యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిరోధించడం ద్వారా నోటి సంక్రమణలను తగ్గిస్తాయి.

Health : లాలాజలంలో యాంటీ సెప్టిక్ గుణాలు.. గాయాలను మాన్పడంలో కీ రోల్ పోషిస్తుందంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలోని కొన్ని భాగాలు, అవయవాలు, శరీర ద్రవాలు స్వయం చాలక రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంటాయనే విషయం తెలిసిందే. ఇవి వివిధ రోగాల నుంచి, గాయాల నుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అలాంటి వాటిలో నోరు కూడా ఒకటి. ఇది కేవలం ఆహారం తీసుకోవడం, మాట్లాడటం కోసం మాత్రమే కాదండోయ్.. నోటిలోని లాలాజలం సహజ స్వస్థతా సామర్థ్యాన్ని(Has natural healing abilities) కలిగి ఉంటుందని ‘PLOS ONE’ జర్నల్‌లో పబ్లిషైన పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇది శరీరానికి రక్షణ వ్యవస్థగా, రోగ నిరోధకంగా పనిచేస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నోటిలో సహజంగా స్రవించే లాలాజలం(saliva)లో హిస్టాటిన్స్ (Histatins) అనే యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిరోధించడం ద్వారా నోటి సంక్రమణలను తగ్గిస్తాయి. అలాగే గాయాల సందర్భంలో బాక్టీరియా వ్యాప్తిని నియంత్రిస్తాయి. తద్వారా వేగంగా నయం అవడానికి సహాయపడతాయి. అంతేకాదు కొన్ని గాయాలను మాన్పడంలో లాలాజలం యాంటిసెప్టిక్స్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఇందులోని రోగ నిరోధక లక్షణాలు కణజాల మరమ్మతు, గాయం మూసుకుపోవడాన్ని వేగవంతం చేస్తాయి. నోటిలో పుండ్లు లేదా అల్సర్లు ఏర్పడినప్పుడు అవి చర్మంపై ఏర్పడే గాయాల కంటే త్వరగా నయం అవుతుంటాయి. అందుకు కారణం లాలాజలంలోని ఔషధ గుణాలేనని, ముఖ్యంగా హిస్టాటిన్స్ ప్రోటీన్లు ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే లాలాజలం శరీరంలో రోగ నిరోధకంగా పనిచేసే ఒక రక్షణ వ్యవస్థ తప్ప, వైద్య చికిత్సకు పూర్తి ప్రత్యామ్నాయం మాత్రం కాదనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. లింక్

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story