- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health Tips : రోజుకు ఒక కప్పు ఈ రసం తాగండి చాలు.. ఆ సమస్యతో హాప్పిటళ్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది!
Health Tips : రోజుకు ఒక కప్పు ఈ రసం తాగండి చాలు.. ఆ సమస్యతో హాప్పిటళ్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది!

దిశ, ఫీచర్స్ : ‘గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లు’ అనే మాట మీరు వినే ఉంటారు. సమస్య ప్రారంభంలోనే పరిష్కరించునే అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయడాన్ని తెలియజేసేందుకు పెద్దలు ఈ సామెతను వాడుతుంటారు. ఆరోగ్యం, ఆహారం విషయంలోనూ ఈ రోజుల్లో చాలామంది అదే చేస్తున్నారు. ఇంటిలోనే పాటించదగ్గ చిన్న చిన్న చిట్కాలతో, రోజువారీ సాధారణ ఆహారాలతో ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశమున్నా పట్టించుకోకపోవడంవల్ల అది ప్రాణాంతకంగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఆర్టరీ బ్లాకేజ్(Artery blockage) కూడా ఒకటి. రోజుకు ఒక కప్పు దానిమ్మ రసం తాగడం వల్ల ఇది గుండెపోటు దారితీయకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం!
ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జర్నల్ ప్రకారం.. రోజుకు కేవలం ఒక కప్పు దానిమ్మ రసం(Pomegranate juice) తాగడంవల్ల వివిధ అనారోగ్యాలతో హాస్పిటళ్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ జ్యూస్ ధమనులలో అడ్డంకులను (Artery blockage) 30% వరకు తగ్గించగలదని పరిశోధనలో వెల్లడైంది. దానిమ్మ జ్యూస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటమే ఇందుకు కారణమని అధ్యయనం పేర్కొన్నది.
దానిమ్మ రసం శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్, యాంథోసయానిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బాడీలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, గుండె జబ్బులకు కారణం అయ్యే ఆక్సీకరణ ఒత్తిడి(Oxidative stress)ని కూడా తగ్గిస్తాయి. అంతేకాదు రోజూ 240 మి.లీ. (సుమారు ఒక కప్పు) దానిమ్మ రసం తాగిన వారిలో కరోటిడ్ ధమనుల(Carotid arteries)లో రక్త ప్రసరణకు అడ్డంగా పేరుకుపోయే ఫలకాలను(Plaques) తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా హైబీపీ ఉన్నవారిలో దానిమ్మ రసం సిస్టోలిక్ రక్తపోటును 12% వరకు తగ్గించగలదని కనుగొన్నారు. దీంతో గుండెపోటు(heart attack), స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ తగ్గిపోతుంది.






