Cancer : కఠినమైన వ్యాయామాలతో క్యాన్సర్‌కు చెక్..! అధ్యయనంలో వెల్లడి

by Javid Pasha |

Cancer : కఠినమైన వ్యాయామాలతో క్యాన్సర్‌కు చెక్..! అధ్యయనంలో వెల్లడి

Cancer : కఠినమైన వ్యాయామాలతో క్యాన్సర్‌కు చెక్..! అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని ఇబ్బంది పెడుతున్న సైలెంట్ కిల్లర్ ఇది. ప్రతీ ఆరుగురిలో ఒకరు దీనివల్ల మరణిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. శరీరంలో కణ విభజన అదుపు తప్పి అసాధారణంగా పెరగడంవల్ల ఇది సంభవిస్తుంది. కాబట్టి క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు గుర్తించగానే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతుంటారు. అయితే రోజువారీ వ్యాయామాలు కూడా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయని హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా అధ్యయనం వెల్లడించింది.

తీవ్రమైన వ్యాయామాలు క్యాన్సర్ ప్రసరణ కణాలను(Circulating tumor cells -CTC) నాశనం చేయడంలో సహాయపడతాయని తెలుసుకునేందుకు పరిశోధకులు ఆ సమయంలో రక్త ప్రవాహాన్ని అనుకరించారు. ఇందుకోసం మైక్రోఫ్లూయిడ్ వ్యవస్థను ఉపయోగించారు. అధిక షీర్ స్ట్రెస్ (High shear stress (SS) - తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో ఉత్పత్తి అయ్యే రకం - 60 డైన్స్/సెం.మీ² వద్ద 90% క్యాన్సర్ సర్క్యులేటింగ్ కణాలను (CTC) తొలగించిందని కనుగొన్నారు. అయితే తక్కువ స్థఆయి సాధారణ వ్యాయాల సందర్భంగా తక్కువ ఒత్తిడి స్థాయిలు(Low stress levels) క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో తక్కువ ప్రభావాన్ని చూపాయని, తీవ్రమైన వ్యాయామాల సందర్భంగా మాత్రం హై షీర్ స్ట్రెస్ అనుకరణ పద్ధతి సాధారణ రక్త కణాలను విడిచిపెట్టి క్యాన్సర్ కణాలను ఎంపిక చేసి చంపిందని గుర్తించారు.

Next Story