- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిపెండెంట్ భాగస్వామితో మహిళల్లో మార్పు.. తగ్గుతున్న లైంగిక ఆసక్తులు!
ఇంటి పనుల్లో అసమానత( unequal housework) అనేది మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడానికి కారణం అవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ,ఫీచర్స్ : ఇంటి పనులు చేసుకోవడం, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం మంచిదే. పైగా అవసరం కూడాను. కానీ.. భార్యా భర్తల్లో ఇవన్నీ కేవలం భార్య మాత్రమే చూసుకోవాల్సి రావడం ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు(PMID: 36112330) చెబుతున్నాయి. ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్, అమెరికన్ సోషియాలాజికల్ రివ్యూ అధ్యయనాలు కూడా ఇదే పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆధునిక సంబంధాల్లో ఇలాంటి పరిస్థితి మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడానికి (sexual desire) దారితీస్తున్నదని పేర్కొన్నాయి.
అధ్యయనాల్లో భాగంగా నిపుణులు 1,000 మందికి పైగా భార్య భర్తల(couples)ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వెల్లడైన విషయాలు ఏమిటంటే.. భార్యా భర్తలు ఇంటి పనులు లేదా బాధ్యతలను సమానంగా పంచుకోవడం ఇద్దరిలోనూ సంతృప్తికి, బలమైన బంధానికి దారితీస్తుండగా.. కేవలం భార్యలు మాత్రమే ఇవన్నీ చూసుకోవడం వారిలో అలసటకు, మానసిక ఒత్తిడికి దారితీస్తున్నది. ముఖ్యంగా ఇంటి పనుల్లో అసమానత( unequal housework) అనేది మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడానికి కారణం అవుతున్నది. అంతేకాకుండా మహిళలు తమ భాగస్వామిని ‘సమాన భాగస్వామి’లా కాకుండా తమపై ‘ఆధారపడే వ్యక్తి(dependent)గా చూడటం మొదలుపెడతారు. ఇది సంబంధంలో ఆకర్షణను (attraction)పూర్తిగా చంపేస్తుందని, పనిచేయని భర్తతో లైంగిక సంబంధంపై భార్యలో ఆసక్తి, కోరిక తగ్గుతుందని కూడా అధ్యయనాలు స్పష్టం చేశాయి. LINK






