- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : లైట్‌సైల్.. రాకెట్‌ను మించిన వేగంతో అంతరిక్షానికి చేరే అధునాతన సాంకేతికత..!
రాకెట్‌కంటే స్పీడ్‌గా దూసుకెళ్లగలిగే ‘లేజర్ శక్తితో నడిచే లైట్‌సైల్ అంతరిక్ష ప్రొపల్షన్ టెక్నాలజీని రూపొందించే పనిలో ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు.

దిశ, ఫీచర్స్ : అంతరిక్షం ఓ అద్భుతం.. అనేక నక్షత్రాలకు నిలయం. మానవాళికి ఆశ్చర్యం కలిగించే అనేక విషయాలను ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు ఛేదించినప్పటికీ.. అంతుపట్టని విషయాలు సైతం ఇంకా చాలానే ఉన్నాయని చెబుతుంటారు. అందులో భాగంగానే నిరంతర పరిశోధనలపై సైంటిస్టిలు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే.. అత్యంత వేగంతో దూసుకెళ్లి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసే రాకెట్ల గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సాంకేతికత భవిష్యత్తులో మరింత అధునాతన రూపం దాల్చనుంది. ఎందుకంటే.. రాకెట్‌కంటే స్పీడ్‌గా దూసుకెళ్లగలిగే ‘లేజర్ శక్తితో నడిచే లైట్‌సైల్ (Lightsail)’ అనే ఒక అధునాతన అంతరిక్ష ప్రొపల్షన్ టెక్నాలజీని రూపొందించే యోచనలో ఖగోళ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.
లైట్‌సైల్ అంటే ?
లైట్‌సైల్(Lightsail) నిజానికి లేజర్ ఎనర్జీతో నడిచే ఒక అధునాతన అంతరిక్ష ప్రొపల్షన్ సాంకేతికత(Advanced space propulsion technology). ఇది ఆల్ఫా సెంటారీ నక్షత్ర వ్యవస్థ (Alpha Centauri star system)ను కేవలం 20 సంవత్సరాల్లో చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ టెక్నాలజీలో, సూర్యకాంతి లేదా లేజర్ కాంతిని ప్రతిబింబించే అతి సన్నని, తేలికైన పొర (sail)ను ఉపయోగిస్తారు. ఇది ఫోటాన్‌ల నుండి ప్రేరణ పొంది అంతరిక్ష నౌక(spaceship)ను ముందుకు నడిపిస్తుంది.
20% అధిక కాంతి వేగంతో..
‘బ్రేక్‌త్రూ స్టార్‌షాట్ ప్రాజెక్ట్ (Breakthrough Starshot)’వంటి కార్యక్రమాలు భూమి నుంచి లక్షలాది శక్తివంతమైన లేజర్‌లను ఉపయోగించి ఈ లైట్‌సైల్‌ను వేగవంతం చేయడాన్ని (Accelerating this lightsail) ప్రతిపాదిస్తున్నాయి. ఈ లేజర్‌లు కాంతి వేగంలో 20% వేగంతో (సుమారు 60,000 కి.మీ/సె) లైట్‌సైల్‌ను నడిపించగలవు. ఇది సాంప్రదాయ రాకెట్‌లతో సాధ్యం కాని అత్యంత వేగం. దీంతో భూమికి భూమికి 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సమీప నక్షత్ర వ్యవస్థ అయిన ఆల్ఫా సెంటారీకి చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది.
ఎవరు డెవలప్ చేస్తున్నారు?
లైట్‌సైల్(Lightsail) ప్రాజెక్టును ప్రస్తుతం రష్యన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త అయిన యూరి మిల్నర్, ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నిర్వహిస్తుండగా.. ఈ బృందంలో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అవి లోబ్, NASA మాజీ డైరెక్టర్ పీట్ వోర్డెన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఫిలిప్ లుబిన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరు భూమిపై లేజర్ శ్రేణుల(With laser ranges)తో 20% కాంతి వేగంతో నడిపించే ‘లైట్‌సైల్’ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు.
ఉపయోగాలేమిటి?
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తోన్న లైట్‌సైల్స్ చిన్నవిగా, సుమారు కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంటే నానో-స్కేల్ అంతరిక్ష నౌకలుగా రూపొందించబడతాయి. ఇవి భూమి నుంచి అంతరిక్షంలోకి కెమెరాలు, సెన్సార్‌లు, కమ్యూనికేషన్ టూల్స్‌ను మోసుకెళ్తాయి. ఈ నౌకలు అంతరిక్షంలోని ఆల్ఫా సెంటారీ వద్దకు చేరుకుని, అక్కడి గ్రహాలు లేదా వాతావరణం గురించి డేటాను సేకరించి, భూమికి తిరిగి పంపుతాయి. అయితే అధునాతన టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంత సులభమేమీ కాదు. అనేక సాంకేతిక సవాళ్లు లేకపోలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు. లేజర్ల కచ్చితత్వం, సైల్ మన్నిక, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్(Long distance communication) వంటివి పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గనుక మానవ జాతి మొదటిసారిగా నక్షత్ర వ్యవస్థల మధ్య ప్రయాణ సామర్థ్యాన్ని సాధించినట్లవుతుందని, అంతరిక్ష అన్వేషణలో కొత్త శకాన్ని ప్రారంభిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. Link






