Relationship: ఆ కోరికల విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ముందట

by Vennela |

Relationship: శృంగారాన్ని ఎంజాయ్ చేయడంలో ఆడ, మగ ఇద్దరిలో ఎవరెలా ఎంజాయ్ చేస్తారనే పరిశోధనలపై ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి.

Relationship: ఆ కోరికల విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ముందట
X

దిశ,వెబ్‌డెస్క్: Relationship: శృంగారాన్ని ఎంజాయ్ చేయడంలో ఆడ, మగ ఇద్దరిలో ఎవరెలా ఎంజాయ్ చేస్తారనే పరిశోధనలపై ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి. అందరి ఆలోచనల్లో మగవారు కేవలం లైంగిక చర్యను మాత్రమే ఎంజాయ్ చేస్తారన్నదే అపోహలేనని తేలింది. మగవారిలోనే మహిళల కంటే ఎక్కువగా రొమాన్స్ చేయాలని కోరిక ఉంటుందట. ఇలా చేయడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందట. పురుషులు ప్రేమ బంధాల్లో ఓ రకమైన సంతోషం పొందుతారట. కానీ విడిపోయే సమయంలో మాత్రం వారిలో బాధ అనేది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇలా ఎందుకు జరుగుతుందంటే చిన్నప్పటి నుంచి మగపిల్లలు పెరిగిన తీరే ఇందుకు కారణమట. మగపిల్లలను సామాజికంగా భావోద్వేగాలను దాచిపెట్టుకుని ప్రవర్తిస్తుంటారు. ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంటే దాన్ని సమాజం అంగీకరించదు. ఇలా మగవారి నియంత్రణలో ఉంచుకున్న తమ భావోద్వేగాలను బయటపెట్టుకునేందుకు ఎదురుచూస్తుంటారు. అలా వారు తమ భాగస్వామి దగ్గరే ఫీలింగ్స్ ను వ్యక్తపరుస్తారు. ఈ విషయంలో పూర్తిగా భాగస్వామిపై ఆధారపడతారు. అందులో రొమాంటిక్ ఫీలింగ్ కూడా ఉంటుంది. పురుషులకు రొమాన్స్ విషయంలో కాసేపు ఎక్కువగా ఎంజాయ్ చేయాలనే కోరిక ఉంటుంది. భావోద్వేగాలను వ్యక్తపరచడాన్ని కూడా వారు మరింత ప్రాముఖ్యంగా భావిస్తుంటారు.

కొందరు పురుషులు తమ ఫీలింగ్స్ ను సోదరి లేదా, తల్లి దగ్గర చూపించి ఓదార్పు కోరుకుంటారు. కానీ వారు ఊహించినంత ప్రభావవంతంగా ఫలితాలను అంగీకరించలేదు. అందుకే భావోద్వేగాలను బహిరంగంగా పంచుకునే క్రమంలో బంధువుల కంటే భాగస్వామి దగ్గరే ఎక్కువగా వ్యక్తపరుస్తుంటారు. కానీ ఇది పురుషులను మానసికంగా బలహీనపడేలా చేస్తుంది. రొమాన్స్ కే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు భాగస్వామి ముందు ఇతర బంధాలను తక్కువగా భావించరాదు. ఈ విధంగా వ్యవహరించడం సమాజంలో బంధాలను నెలకొల్పడంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సపోర్ట్ నెట్ వర్క్ కోల్పోతారు. మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. కేవలం పురుషుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసమే పరిగణించాల్సి ఉంటుంది.

కానీ ఈ విషయంలో మహిళలు చాలా ప్రత్యేకం. వారు చిన్నప్పటి నుంచి అనేక వైవిధ్యమైన పరిస్థితుల మధ్య పెరుగుతుంటారు. తమ ఫీలింగ్స్ ను ఇతరులతో పంచుకుంటారు. సమస్య పరిష్కారాన్ని ఫాస్టుగా వెతుకుతారు. ఈ విధంగా తమ ఫీలింగ్స్ ను వ్యక్తపరచడానికి కేవలం భాగస్వామి మీదే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పురుషుల విషయంలో వారి భావోద్వేగాలను షేర్ చేసుకునేందుకు సానుకూల వాతావరణం, అంగీకారం ఉండటంతోపాటు వారి స్నేహితులు, కుటుంబాలను కూడా కలుపుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం మరింత ఆరోగ్యకరమైన సమర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోగలుగుతాం.


Next Story