- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐని ఇంకా సైన్స్ ఫిక్షన్‌గానే భావిస్తున్నారా ?
ఇప్పటికీ కొందరు ఏఐ అంటే ఫ్లయింగ్ కార్లు లేదా రోబోట్లు వంటి అసాధారణ విషయంగానే పరిగిణిస్తున్నారు!

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏఐ ఒక సూపర్ పవర్ టెక్నాలజీగా విస్తరిస్తోంది. అయితే భారత్ సహా, భారత ఉపఖండ దేశాల్లోనూ దీనిని ఉపయోగిస్తున్నప్పటికీ, కృత్రిమ మేధ ఇంకా సైన్స్‌ఫిక్షన్‌గానే భావిస్తున్నవారే అత్యధికమంది ఉంటున్నారు. అర్బన్ ఏరియాస్‌లోని యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవగాహన కలిగి ఉంటున్నది. దానిని వినియోగించుకుంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఈపరిస్థితి చాలా అరుదుగా ఉందని అధ్యయనాలు, నివేదికలు పైతం పేర్కొంటున్నాయి.
స్మార్ట్‌ఫోన్ యాక్సెస్‌లో వీరు తక్కువ!
గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ మొబైల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ - 2025 ప్రకారం.. దక్షిణాసియాలోని (భారత్ సహా) మహిళలు పురుషుల కంటే స్మార్ట్‌ఫోన్ యాక్సెస్‌లో 30-40% తక్కువగా ఉన్నారు. మొబైల్ ఇంటర్నెట్ యూజ్‌లో కూడా పెద్ద గ్యాప్ ఉంది. ఇది ఏఐ (AI) టూల్స్ వాడకానికి ప్రధాన అడ్డంకిగా మారుతోంది. అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ మల్టిపుల్ ఇండికేటర్ సర్వే (78th round) & అదర్ డిజిటల్ స్కిల్స్ స్టడీస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో బేసిక్ డిజిటల్ టాస్కులు (ఎక్సెల్ వంటివి) చేయగలిగేవారు చాలా తక్కువ. ఇక ఏఐకి మరింత అధిక స్థాయి డిజిటల్ కంఫర్ట్ కావాలి. కాబట్టి రూరల్ ఏరియాల్లో ఇది అందరికీ అందని ద్రాక్షగానే మిగిలిందంటున్నారు నిపుణులు.
ఏఐ అంటే అదేనా?
ఇప్పటికీ చాలామంది గ్రామీణ ప్రజలు ఏఐ ఇంకా సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు, వైరల్ వీడియోలు లేదా హెడ్‌లైన్స్ ద్వారా మాత్రమే తెలుసు. ఎంటర్‌ప్రైజ్ రంగంలో, డేటా సెంటర్లు, ప్రభుత్వ సమ్మిట్లు చూస్తే భారత్ ఏఐ సూపర్ పవర్‌గా అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న నగరాలు, సామాన్య ప్రజల వద్దకు వెళ్తే ఏఐ అనేది ఇంకా ప్రజల రోజువారీ జీవితంలో భాగం కాదు. అత్యధిక మంది దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదని నివేదికలు పేర్కొంటున్నాయి.
డేటా ఏం చెబుతోంది?
నివేదికల ప్రకారం.. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు మాత్రమే సాధారణ డిజిటల్ వర్క్స్ (ఎక్సెల్ వంటివి) చేయగలుగుతున్నారు. సుమారు 25% మంది ఇంకా ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారు. 85% మంది భారతీయుల ఇండ్లల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నప్పటికీ, వాటి వాడకం ప్రధానంగా పురుషులకు, యువతకే ఎక్కువగా పరిమితం అవుతోంది. మహిళలు పురుషుల కంటే 40% తక్కువగా స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ యాక్సెస్ కలిగి ఉంటున్నారు. అంతేకాదు ఏఐ వినియోగానికి గ్రామీణ భారతంల భాషా సమస్య కూడా పెద్ద అడ్డంకిగా ఉంటోందని నిపుణులు అంటున్నారు. చాలా ఏఐ టూల్స్ ఇంగ్లీష్ లేదా కొన్ని ప్రధాన భాషల్లోనే ఉంటున్నాయి. గ్రామీణ పాఠశాలల్లో సైతం ఏఐ కరిక్యులం వంటిది ఏదీ ఉండట్లేదు. అందుకే ఏఐ ప్రభావం ఇంకా తక్కువగానే ఉందంటున్నారు నిపుణులు.
భవిష్యత్తులో ఏఐ ప్రభావం..?
ఇప్పటికీ చాలామంది భారతీయులు ఏఐ అంటే ఫ్లయింగ్ కార్లు లేదా రోబోట్లు వంటి అసాధారణ విషయంగానే పరిగిణిస్తున్నారు. ఇక యువత ఏఐ పట్ల ఆసక్తితో, ఆశతో ఉన్నప్పటికీ ఈ సాంకేతికత సినిమాలు, ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఆశల మీదనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే ఏఐ కూడా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లాగా డిజిటల్‌గా ఆధునికమైన, ఆంగ్లం తెలిసిన, పట్టణ యువకులకు మాత్రమే పరిమితం అవుతుంది. దీన్ని అధిగమించాలంటే ప్రాంతీయ భాషల్లో ఏఐ టూల్స్, తక్కువ బ్యాండ్‌విడ్త్‌కు అనుకూలమైన డిజైన్, పాఠశాలలు &కమ్యూనిటీల ద్వారా కూడా ఏఐపట్ల ప్రచారం, అవగాహన అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు.






