- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: ఇరుకు గది అద్దె నెలకు రూ. 62000 ఎక్కడో తెలిస్తే షాక్ తినడం ఖాయం.. ఇదెక్కడి అద్దె మోతరా బాబోయ్
Viral News: దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో, విలాసవంతమైన విల్లాల నుండి బంక్ బెడ్‌లతో కూడిన చిన్న గదుల వరకు అనేక రకాల అద్దె ఇళ్లు మనకు కనిపిపిస్తాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral News: దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో, విలాసవంతమైన విల్లాల నుండి బంక్ బెడ్‌లతో కూడిన చిన్న గదుల వరకు అనేక రకాల అద్దె ఇళ్లు మనకు కనిపిపిస్తాయి. దుబాయ్ లాంటి పెద్ద నగరంలో, అధిక అద్దె ధరలు ఏ రేంజులో ఉంటాయో తెలిస్తే గుండె గుభేల్ మనక మానదు. ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో నెలకు AED 2,700 (రూ. 62,000) కు బాల్కనీతో కూడిన చిన్న రూమ్ అద్దెకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు ఈ ప్రకటన రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నేషన్ సర్వీసెస్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. దుబాయ్‌లోని అప్‌స్కేల్ మెరీనా ప్రాంతంలో ఒక బెడ్, వార్డ్‌రోబ్‌కు సరిపోని ఒక చిన్న స్థలం నెలకు రూ. 62,000 (AED 2,700)తో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు మీమ్స్ పేల్చుతున్నారు. ఇది కొత్త చర్చకు దారితీసింది. కొంతమంది సరదాగా ఆ గదిలో స్థలం ఎంత ఉంది అని అడిగారు, చాలా మంది నెటిజన్లు దీనిని ముంబైలోని ఇరుకైన అపార్ట్‌మెంట్‌లతో పోల్చారు.






