- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Red Banana:అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న రెడ్ బనానా.. వీటి గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరుగా
సాధారణంగా మనం అరటి పండ్లని చూసే ఉంటాం. అవి కాయలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, పండైన తర్వాత పసుపు కలర్‌లో ఉంటాయి.

దిశ, ఫీచర్స్: సాధారణంగా మనం అరటి పండ్లని చూసే ఉంటాం. అవి కాయలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, పండైన తర్వాత పసుపు కలర్‌లో ఉంటాయి. మరి రెడ్ కలర్ బనానాను ఎప్పుడైనా తిన్నారా..? అసలు దీని గురించి విన్నారా..? వినడానికే షాకింగ్‌గా ఉన్న ఈ పండు తినడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎర్రటి అరటిపండు ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, నరాల పనితీరు, గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ, కిడ్నీ, కాలేయం, పేగుల ఆరోగ్యం కోసం అనేక విటమిన్లు, ఖనిజాలు, ఔషధ గుణాలను అందిస్తుంది. ఈ పండు ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక అద్భుతమైన ఔషధం అంటున్నారు వైద్య నిపుణులు.
* అసలు ఈ పండును ఏ సమయంలో తినాలి.. ?
ఎర్రటి అరటిపండుని ఉదయం 6 గంటల సమయంలో తినాలి. ఈ సమయంలో జీర్ణక్రియ అనేది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను పూర్తిగా అంగీకరించ కలిగే స్థితిలో ఉంటుంది. ఉదయం ఈ పండును తినడం వల్ల శరీరానికి శక్తి, శాంతి, జీవక్రియతో కూడిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. మరి ఇతర సమయాల్లో అంటే ఉదయం 11 గంటల సమయంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా తినచ్చంటున్నారు నిపుణులు.
* నరాల బలహీనత సమస్యలు..
నరాలు బలహీనమైనప్పుడు శక్తి లోపం, నిస్పృహ వంటి సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి వారికి ప్రతిరోజూ రాత్రి ఒక ఎర్రటి అరటిపండు తినడం ద్వారా నరాలు బలపడతాయి. దీన్ని 48 రోజుల పాటు కొనసాగిస్తే, నరాలు శక్తివంతంగా మారుతాయి.
* కంటి చూపు సమస్యలు..
ఈ పండు కంటి చూపు సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది. కంటి చూపు మందగించడం ప్రారంభించిన వారి కోసం ఇది ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ప్రతిరోజూ ఎర్రటి అరటిపండు తీసుకోవడం వల్ల కంటి చూపు క్లియర్ అవుతుంది.
* పంటి సంబంధిత సమస్యలు..
పంటి నొప్పి, పళ్ళ క్షీణత వంటి సమస్యలు ఉన్న వారికి ఈ అరటిపండు మేలు చేస్తుంది. పళ్ళ సమస్యలు ఉన్నవారు, 21 రోజుల పాటు ఈ అరటిపండు నిరంతరం తినడం ద్వారా పళ్ళు బలపడుతాయి.
* జీర్ణక్రియ సంబంధిత సమస్యలు:
గత రాత్రి తిన్న ఆహారం వల్ల ఉదయం మలబద్ధకం సమస్యలు వస్తే, ఉదయం ఒక ఎర్రటి అరటిపండు తినడం ద్వారా పేగులు సక్రమంగా పని చేస్తాయి. సులభంగా మలవిసర్జన జరుగుతుంది. ఇలా ఎర్రటి అరటిపండు తినడం ద్వారా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పండు మీకు ఎక్కడ దొరికిన కానీ తినడం అస్సలు మిస్ చేసుకోకండి.
(నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)






