Microplastic: నల్లా నీళ్లల్లో మైక్రో ప్టాస్లిక్స్.. ఈజీగా తొలగించే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు

by Javid Pasha |

Microplastic: నల్లా నీళ్లల్లో మైక్రో ప్టాస్లిక్స్.. ఈజీగా తొలగించే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు

Microplastic: నల్లా నీళ్లల్లో మైక్రో ప్టాస్లిక్స్.. ఈజీగా తొలగించే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల రకరకాల కాలుష్యాలు పెరిగిపోతున్నాయ్.. అందులో ప్లాస్టిక్ కూడా కాలుష్యం కూడా ఒకటి. ఇది పర్యావరణంపైనే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. తినే ఆహారంలో, తాగే నీటిలో, చివరికి భూ గర్భ జలాల్లో కలిసి మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇలా జరగకుండా ఉండేందుకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ సహా, ఇతర ప్రత్యామ్నాయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఏంటంటే.. నల్లా(కుళాయి) నీటిని మరిగించి, వడబోసి వినియోగించడంవల్ల మైక్రోప్లాస్టిక్ కాలుష్యం బారి నుంచి తప్పించుకోవచ్చు.

భూమిలో కలిసిన ప్లాస్టిక్ కరగకపోవడం కారణంగా అది భూగర్భ జలాల్లో కలుస్తోంది. దీంతో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయే అవకాశమున్న నగరాల్లో, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల్లో మైక్రోప్లా్స్టిక్ చేరుతున్నదని చైనాలోని జినాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా కుళాయినీటి ద్వారా మైక్రోప్లాస్టిక్ మానవుల శరీరంలోకి ప్రవేశిస్తోందని గుర్తించారు. అలా జరగకూడదంటే.. ఆ నీటిని మరిగించి తర్వాత వినిగించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలా చేయడంవల్ల అందులోని మైక్రో అండ్ నానో ప్లాస్టిక్ కణాలు తొలగిపోతాయి.

అధ్యయనంలో భాగంగా జినాన్ యూనివర్సిటీ పరిశోధకులు గ్వాంగ్‌జౌ మెడికల్ యూనివర్సిటీతో కలిసి, నీటిలో మైక్రోప్లాస్టిక్‌ను సమర్థవంతంగా తగ్గించే ఒక సింపుల్ మెథడ్‌ను కనుగొన్నారు. ఏంటంటే.. తాగడానికి వినియోగించే కుళాయి నీటిని (hard tap water) మరిగించాలి. ఆ తర్వాత కాఫీ ఫిల్టర్ వంటి సాధారణ ఫిల్టర్ ద్వారా వడబోస్తే 90% వరకు నానో అండ్ మైక్రోప్లాస్టిక్‌లను తొలగిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ వల్ల నీటిలో లైమ్‌స్కేల్(calcium carbonate) ఏర్పడటంతో అది ప్లాస్టిక్ కణాలను చుట్టుముట్టి, మైక్రో అండ్ నానో ప్లాస్టిక్ కణాలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.

Next Story