Bee Venom : తేనెటీగ కుడితే రొమ్ము క్యాన్సర్ పరార్..! కానీ ఆ సందర్భం ఎప్పుడంటే..

by Javid Pasha |

Bee Venom : తేనెటీగ కుడితే రొమ్ము క్యాన్సర్ పరార్..! కానీ ఆ సందర్భం ఎప్పుడంటే..

Bee Venom : తేనెటీగ కుడితే రొమ్ము క్యాన్సర్ పరార్..! కానీ ఆ సందర్భం ఎప్పుడంటే..
X

దిశ, ఫీచర్స్ : తేనెటీగలు అనగానే చాలా మందికి వెంటనే గుర్తుచ్చేది వాటి ద్వారా లభించే తీయనైన తేనె. రుచిలో ఆమోఘమే కాదండోయ్.. ఆరోగ్యానికీ మంచిదే. అయితే తేనెటీగలు కుడితే మాత్రం చాలా డేంజర్ అనే విషయం తెలిసిందే. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే వాటి విషం శరీరమంతా పాకి ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ఆ విషమే ఇప్పుడు ప్రాణాంత రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

తేనెటీగల కుట్టడంవల్ల వాటి విషం ప్రాణాంతకం కావచ్చు. కానీ అదే విషాన్ని రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించినప్పుడు మాత్రం ప్రాణాలు రక్షిస్తుందని రీసెంట్ పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు npj Precision Oncology (DOI: 10.1038/s41698-020-00129-0), Biomedicines (PMC10964279) జర్నల్స్‌లో పబ్లిష్ అయ్యాయి. పరిశోధకుల ప్రకారం ల్యాబొరేటరీ, అలాగే జంత పరీక్షలలో (In laboratory and animal tests) తేలిందేమిటంటే.. తేనెటీగల విషంలోని ప్రధాన పెప్టైడ్ అయిన మెలిట్టిన్, క్యాన్సర్ కణాల పొరలను ధ్వంసం చేయడం, ట్యూమర్ వృద్ధిని అడ్డుకోవడం, కీమోథెరపీ ప్రభావాన్ని మెరుగుపరచడం వంటి సామర్థ్యాలను కనబరించింది.

ముఖ్యంగా మెలిట్టిన్, అపామిన్, అలాగే అడోలాపిన్ వంటి తేనెటీగల విషంలోని భాగాలు కలిసి ఒక శక్తివంతమైన కాక్టెయిల్‌ను రూపొందిస్తాయి. ఇది అపోప్టోసిస్(Programmed cell death)ను ప్రేరేపించడం, మెటాస్టాసిస్ (క్యాన్సర్ వ్యాప్తి)ని నిరోధించడం వంటి యాంటీ-ట్యూమర్ ప్రభావాలను చూపుతుంది. అంటే మెలిట్టిన్ క్యాన్సర్ కణాలలో EGFR అండ్ HER2 రిసెప్టర్ల ఫాస్ఫోరిలేషన్‌ను అడ్డుకోవడం ద్వారా ట్రిపుల్-నెగటివ్, అండ్ HER2-ఎన్‌రిచ్డ్ రొమ్ము క్యాన్సర్ కణాలను వేగంగా నాశనం చేస్తుంది. అంటే తేనెటీగల విషం పెప్టైడ్ కణ పొరల(Peptide in cell membranes)లో రంధ్రాలను ఏర్పరచడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తున్నట్లు పరిశోధకుల ప్రారంభ దశ క్లినికల్ డేటా(Initial stage clinical data) సూచిస్తోంది.

అయితే సాధారణ కణాలపై తేనెటీగల విష ప్రభావం(Bee venom) తక్కువగా ఉంటుందని, సాంప్రదాయ చికిత్సలతో కలిపి ఉపయోగించినప్పుడు మాత్రం అది రొమ్ము క్యాన్సర్ దుష్ప్రభావాలను తగ్గించి, ఫలితాలను మెరుగుపరుస్తుందని పరిశోధకులు గుర్తించారు పరిశోధకులు. అయితే ఈ థెరపీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. మానవులపై చికిత్స సామర్థ్యాలను నిరూపించడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరమని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. సక్సెస్ అయితే గనుక రొమ్ము క్యాన్సర్ నివారణలో గొప్ప ముందడుగు పడినట్టే!

Next Story