- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతున్నది. ఇందుకు ఇటీవల కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు స్థలాల వేలం పాటలో పలికిన ధరలు ఓ ఉదాహరణ. అలాగే జూన్ నెలలో ఆస్తి లావాదేవీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఒక్క నెలలోనూ ఏకంగా 6,391 యూనిట్లు అమ్మేసినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో స్పష్టం చేశారు.
15 శాతం పెరిగింది
రాష్ట్రంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ. కోటి కంటే కంటే ఎక్కువ విలువైన ఇండ్ల సంఖ్య 21 శాతంగా నమోదు కావడం విశేషం. అలాగే 2,000 లకు చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇండ్ల సంఖ్య 17 శాతంగా ఉంది. రిజిస్టర్డ్ ఆస్తుల సగటు ధర ఈ ఏడాది 15 శాతం పెరిగింది. అదే రంగారెడ్డి జిల్లాలోనైతే 20 శాతం పెరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా అంచనా ప్రకారం.. జూన్ 2025లో హైదరాబాద్‌లో నివాస స్థలాల రిజిస్ట్రేషన్లు 3 శాతం పెరిగాయి. మొత్తం ఇండ్ల సంఖ్య 6 శాతం పెరిగింది. అలాగే రూ.కోటికిపైగా ఉండే ఇండ్ల రిజిస్ట్రేషన్లు 35 శాతానికి పెరిగాయి. ఇది మొత్తం రిజిస్ట్రేషన్లలో 21శాతం కావడం గమనార్హం. హైదరాబాద్ నివాస మార్కెట్ అంటే నాలుగు జిల్లాల పరిధిగా లెక్కించారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుంచి లావాదేవీలు పెరిగినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఖరీదైన ఫ్లాట్లు
ఈ ఏడాది జూన్ లో రూ.కోటికి పైగా ఉండే కేటగిరీలోని ఇండ్ల రిజిస్ట్రేషన్ల శాతం వాటా గతేడాది జూన్ తో పోలిస్తే 21 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. అలాగే రూ.50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన, రూ.50 లక్షల నుంచి రూ.కోటి పరిధిలోని ఇండ్ల అమ్మకాలు తగ్గాయి. ఫలితంగా వాటి మొత్తం వాటా తగ్గింది. అయినప్పటికీ అవి మొత్తం అమ్మకాల్లో వరుసగా 52%, 26% వాటాగా ఉన్నాయి. విలువపరంగా రూ.కోటికి పైగా ఉండే ఇండ్ల అమ్మకాలు 51 శాతం వాటాను అందించాయి. ఇది తక్కువ సంఖ్యలో ఇండ్లు ఉన్నప్పటికీ ప్రీమియం ఆస్తులకు డిమాండ్ పెరుగుతుంది.
రిజిస్ట్రేషన్లు (యూనిట్లు, రూ.కోట్లు)
అంశం జూన్ 2024 జూన్ 2025 తేడా జూన్ 2024(రూ.కోట్లు) జూన్ 2025(రూ.కోట్లు) తేడా
రూ.50 లక్షల లోపు 4,251 3,342 –21% 1,345 1,052 -22%
రూ.50 లక్షల నుంచి రూ.కోటి 1,794 1,687 -6% 1,259 1,189 -6%
రూ.కోటికి పైగా 1,011 1,362 -35% 1,710 2,346 37%
ఏవి ఎన్ని?(చదరపు అడుగులు)
యూనిట్ సైజ్ జూన్ 2024 జూన్ 2025
0-500 3% 3%
500-1000 15% 12%
1000-2000 68% 68%
2000-3000 11% 14%
>3000 3% 3%
దీన్ని బట్టి త్రిబుల్ బెడ్రూం ఇండ్ల కొనుగోలుదారుల సంఖ్య 3 శాతం పెరిగింది. అదే డబుల్, సింగిల్ బెడ్రూం ఇండ్ల కొనుగోలుదారుల సంఖ్య అంతే ఉంది.
ఏ జిల్లాలో ఎన్ని రిజిస్ట్రేషన్లు?
జిల్లా జూన్ 2024 జూన్ 2025
హైదరాబాద్ 16% 12%
మేడ్చల్ 41% 39%
రంగారెడ్డి 43% 49%
మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా వాటా పెరిగింది. అంటే రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం విరాజిల్లుతున్నది.
ధరల్లోనూ రంగారెడ్డి టాప్
జిల్లా చ.అ.సగటు ధర జూన్ 2025లో పెరుగుదల
హైదరాబాద్ 4,750 2 శాతం
మేడ్చల్ 3,460 5 శాతం
రంగారెడ్డి 5,455 20 శాతం
సంగారెడ్డి 2,524 14 శాతం
మొత్తం మార్కెట్ 4,704 15 శాతం
అత్యధిక విలువైన సేల్ డీడ్
జిల్లా ప్రాంతం చదరపు అడుగులు ధర
హైదరాబాద్ షేక్ పేట >3000 7,85,00,800
రంగారెడ్డి కొండాపూర్ >3000 6,30,00,000
రంగారెడ్డి హైటెక్ సిటీ >3000 5,93,36,476
రంగారెడ్డి కొండాపూర్ >3000 5,45,00,000
రంగారెడ్డి కోకాపేట >3000 5,28,79,000
రియల్ రంగానికి ఢోకా లేదు
తాజా నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం ఒకటీ రెండు జిల్లాల్లో కాస్త తగ్గినప్పటికీ ఓవరాల్ చాలా పెరిగింది. దీన్ని బట్టి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా లేదు. రంగారెడ్డి జిల్లాలో జోరుగా నడుస్తున్నదని లెక్కలే చెప్తున్నాయి. ఇండ్ల విలువ పెరిగింది. సేల్స్ యూనిట్ల సంఖ్య కూడా పెరిగింది. అదే క్రమంలో చదరపు అడుగు ధర కూడా రంగారెడ్డి జిల్లాలో సగటున రూ.5,455 పలుకుతుండడం విశేషం. ఇదే పెట్టుబడులకు సరైన సమయంగా రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు.






