కాలి మడమల్లో పగుళ్లతో ఇబ్బందులా..? ఇన్ఫెక్షన్ తగ్గి మృదువుగా మారే చిట్కాలివే..!

by Javid Pasha |

కాలి మడమల్లో పగుళ్లతో ఇబ్బందులా..? ఇన్ఫెక్షన్ తగ్గి మృదువుగా మారే చిట్కాలివే..!

కాలి మడమల్లో పగుళ్లతో ఇబ్బందులా..? ఇన్ఫెక్షన్ తగ్గి మృదువుగా మారే చిట్కాలివే..!
X

దిశ, ఫీచర్స్ : కొన్ని సమస్యలు చూడ్డానికి చిన్నవిగానే అనిపిస్తాయి. కానీ ఆరోగ్యంగా, మానసికంగా అధిక ప్రభావం చూపుతాయి. కాలి మడమలు పగలడం కూడా అలాంటిదే. వర్షాకాలంలో రోడ్లు, కాలనీలు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వడం, ఆ నీటిలో నుంచి నకడక కొనసాగించడం వంటి పరిస్థితులవల్ల కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు గురై మడమలు పగుతులుతుంటాయి. కొందరికి శరీరంలో జరిగే మార్పులు, వేడి, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా పగుళ్లు ఏర్పడవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

గ్లిజరన్‌ అప్లై చేయండి

* కాలి మడమల్లో పగుళ్లు ఏర్పడటంవల్ల నొప్పితోపాటు పాదాలు అంద విహీనంగానూ కనిపిస్తుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. పగుళ్లు ఏర్పడిన భాగంలో గ్లిజరిన్ అప్లై చేయాలంటున్నారు నిపుణులు. అయితే దీనికి ముందు గ్లిజరిన్‌లో కొంచెం రోజ్ వాటర్ కూడా కలపాలి. పాదాలు శుభ్రంగా కడిగిన తర్వాతనే పగుళ్లపై అప్లయ్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేశాక 20 నుంచి 30 నిమిషాల తర్వాత పాదాలను కడిగి, కాటన్ క్లాత్‌తో తడి ఆరిపోయేలా తుడవాలి. గ్లిజరిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి పగుళ్లపై అలా రెండుమూడు రోజులు దానిని అప్లై చేస్తే క్రమంగా తగ్గిపోతాయి.

తేనెతో మాయిశ్చరైజింగ్

*కాలి మడమల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగించే మరో అద్భుతమైన రెమెడీ తేనెక. నొప్పి, గాయాలు వంటి సందర్భాల్లో వాటి నివారణలో ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, ఉత్తమ మాయిశ్చరైజర్‌గా యూజ్ అవుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఉపయోగించే ముందు కొన్ని గోరు వెచ్చని నీళ్లను బకెట్లో గానీ, టబ్‌లో గానీ తీసుకోవాలి. అందులో తేనె కలిపి, ఆ తర్వాత పగుళ్లు పాదాల భాగాన్ని అందులో ముంచాలి. ఓ 20 నిమిషాల తర్వాత బయటకు తీసి కడగాలి. రెండు మూడు రోజులు ఇలా చేస్తే పగుళ్లు పూర్తిగా నయం అవుతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story