- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ పక్క వర్షం.. లవ్ అంటూ వారితో కాఫీ తాగుతూ క్యూట్ ఫొటో పంచుకున్న రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతుంది.

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతుంది. మొన్నటివరకు పుష్ప-2, యానిమల్, ఛావా వంటి చిత్రాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే కుబేర చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ బ్యూటీ చి ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ సినీ చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మండన్నకు ఈ గుర్తింపు. సొంతం సొంతం కావడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు. చెలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన, అందం, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.
తర్వాత వారసుడు, VNR Trio, ఆడవాళ్లు మీకు జోహార్లు, పొగరు, సుల్తాన్, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, గీతా ఫలో, గీత గోవిందం, దేవదాస్, కిరాక్ పార్టీ వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసింది ముఖ్యంగా పుప్పు రెండు, బాగాల్లో సుకుమార్ దర్శకత్వం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి తన ప్రదర్శన కనబర్చింది. మొదటి పార్టీ ప్రియురాలిగా సెకంగ్ భాగంలో అల్లు అర్జున్ కు భార్యగా అద్భుతంగా నటించి జనాల్ని మెప్పించింది.
అలాగే ఛావా చిత్రంగా వివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇందులో మహారాణి పాత్రలో నటించింది. ఆకట్టుకునే చీరకట్టు, బొట్టు విధానంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందనీ చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టింది. తనతో పాటు మరో వ్యక్తి కాఫీ తాగుతోన్న ఫొటోను పంచుకుంది. ముఖం కనిపించకుండా.. కేవలం కాఫీ పట్టుకుని దిగిన పిక్ పంచుకున్నారు. ఈ హ్యాండ్ విజయ్ దేవరకొండనా? అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం మొదలుపెట్టారు. అలాగే కవాసన, రుచి, రంగు.. మొత్తం కాఫీ చాలా బాగుంది. కాఫీ ఇజ్ జస్ట్ లవ్ అంటూ రాసుకొచ్చింది.






