- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పోరేట్ ఉద్యోగం మానేసి ఆవు పేడతో కోటీశ్వరుడయ్యాడు.!
చిన్న రైతులకు సేంద్రీయ సాగువైపు మళ్లేందుకు సాయం చేస్తూ, తానూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

దిశ, ఫీచర్స్: ఆయనొక కార్పొరేట్ కంపెనీలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసేవాడు. డెయిరీ పరిశ్రమ మీద ఆసక్తి. సంపాదించిందంతా దాంట్లోనే పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తూ నష్టాల పాలయ్యాడు. అయినా నిరాశ చెందలేదు. ఆవు పేడ, పేడ పురుగులతో వెర్మీ కంపోస్ట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. చిన్న రైతులకు సేంద్రీయ సాగువైపు మళ్లేందుకు సాయం చేస్తూ, తానూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.
కార్పొరేట్‌ను వదిలేసి
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన 38 ఏళ్ల రాజ్ సింగ్ 2008లో ఆటోమోటివ్ మేనేజ్‌మెంట్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ, 2014లో మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. దాదాపు ఒక దశాబ్దం పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన రాజ్, ఒత్తిడి, రొటీన్ లైఫ్‌తో విసిగెత్తిపోయి 2017లో ఏడు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని 40 ఆవులతో డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొద్దిరోజుల్లోనే తన వ్యాపారాన్ని 250 ఆవులతో విస్తరించించాడు. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న సమయంలోనే కొవిడ్ మహమ్మారి కుదిపేసింది. డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ లేదు. ఖర్చులేమో పెరిగిపోతున్నాయి. ఒక్క నెలకే రూ. 60 లక్షల నష్టం వచ్చింది.
సంక్షోభం నుంచి స్టార్టప్
డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోవడం, బిజినెస్‌లో లాస్ స్టార్టవడంతో పునరాలోచనలో పడ్డాడు రాజ్ సింగ్. నిండా మునగకముందే తేరుకోవాలని డెయిరీ వ్యాపారాన్ని మూసేశాడు. ఆవు పేడను వృథా కాకుండా ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. సేంద్రీయ వ్యవసాయం పట్ల పెరుగుతున్న ఆసక్తిని గమనించి ఆవు పేడను వెర్మీకంపోస్ట్‌గా మార్చే వ్యాపారం స్టార్ట్ చేశాడు. పురుగుల సహాయంతో ఆవు పేడను మెరుగైన సేంద్రీయ ఎరువుగా మార్చే ప్రక్రియ ఇది. దీనివల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా, 'గ్రోయింగ్ ట్రీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్' అనే స్టార్టప్‌ను ఏర్పాటుచేశాడు.
రైతులకు మంచి అవకాశం
చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ ఎరువులను సులభంగా ఉపయోగించగలిగేలా కిలో రూ. 3 నుంచి రూ. 4.50 వరకు విక్రయిస్తున్నాడు. స్థానికంగా లభించే ఆవు పేడ ఎరువులో భుస (పొట్టు) ఉంటుంది. అది పూర్తిగా కుళ్లిపోయి ఉండదు. ఫలితంగా పురుగుల సమస్య వచ్చేది. రసాయనిక పురుగుమందులు కూడా వాడాల్సి వచ్చేది. కానీ రాజ్ వెర్మీకంపోస్ట్‌తో కూరగాయల నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. ఎకరానికి 6-7 క్వింటాళ్ల వెర్మీకంపోస్ట్‌ను ఉపయోగిస్తూ మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉంది. నర్సరీలు, కూరగాయల తోటలు, పాలీహౌస్‌లకు దీనిని విస్తరించాడు. ఉత్తరప్రదేశ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బెంగళూరు, పూణే వంటి ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటుచేసి స్థానిక డైరీలు, సొసైటీల సహకారంతో ముడిసరుకు సరఫరా చేస్తున్నాడు.
రూ. 2 కోట్ల వార్షికాదాయం
ఖరీదైన ప్లాస్టిక్ షీట్లు, ఇటుకలు, కాంక్రీట్ బెడ్‌లకు బదులుగా, అరటి ఆకులను మల్చింగ్‌కు ఉపయోగించాడు రాజ్. గాజియాబాద్‌లో వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, అరటి ఆకులు కంపోస్ట్ బెడ్‌ల ఉష్ణోగ్రతను 25 డిగ్రీలకు పరిమితం చేస్తాయన్నమాట. సాధారణంగా వెర్మీకంపోస్ట్‌ను 30 రోజుల్లో విక్రయిస్తారు. కానీ రాజ్ 90 రోజుల పాటు పూర్తి కుళ్లిపోయే వరకు అలాగే ఉంచుతాడు. ఇది ఉత్పత్తి నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. 500 కంపోస్ట్ బెడ్‌లను ద్వారా ప్రతి నెలా 500 టన్నుల వెర్మీకంపోస్ట్‌ను ఉత్పత్తి చేస్తూ రూ. 2.5 కోట్ల వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.






