- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాబోయే వధూవరులకు భారీ గుడ్ న్యూస్.. మీ కలలను నెరవేర్చుకునే టైం వచ్చేసిందిగా..
ఏ కార్యం చేసుకోవాలన్నా ముహూర్తాలు చూస్తాం. ముఖ్యంగా పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా వధూవరుల పేరిట ముహూర్త బలం ఉండాల్సిందే.

దిశ, వెబ్‌డెస్క్ : ఏ కార్యం చేసుకోవాలన్నా ముహూర్తాలు చూస్తాం. ముఖ్యంగా పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా వధూవరుల పేరిట ముహూర్తబలం ఉండాల్సిందే. ఇద్దరి జాతక చక్రాల ఆధారంగా పండితులు ఈ ముహూర్తాలను చూస్తారు. ఆషాడ మాసాసినిక ముందు ఆగిపోయిన పెళ్లి భాజాలు మళ్లీ మోగే సమయం వచ్చేసింది. మరో 15 రోజులు శుభముహూర్తాలు ప్రారంభం అవుతుండటంతో కళ్యాణ మండపాలు, జ్యువెలరీ షాపులు, వస్త్ర దుకాణాలు సందడిగా మారనున్నాయి. ఫొటో గ్రాఫర్లకు ఇక చేతినిండా పనిదొరకనుంది. పల్లెలు, పట్టణాలు సందడిగా మారనున్నాయి. ఓ వైపు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన పల్లెవాసులు ఇక పెళ్లి పనుల్లోనూ బిజిబిజీగా గడపనున్నారు. జులై 26 నుంచి ప్రారంభమయ్యే శుభముహూర్తాలు నవంబర్ 27 వరకు కొనసాగనున్నట్లు వేదపండితులు పేర్కొంటున్నారు.
2025 సంవత్సరం ప్రారంభంలో తక్కువ శుభ ముహూర్తేలు ఉండటంతో ఎక్కువగా పెళ్లిల్లు జరగలేదు. మంచి గడియలు లేమన్న కారణంతో చాలా మంది తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఇక అలాంటి వారికి జులై మాసం శుభవార్తను మోసుకొచ్చింది. జులైలో 26,30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు శుభారంభం చేశాయని పండితులు చెబుతున్నారు. ఆగస్ట్ 1,2,5,6,7,8,9 తేదీల్లో మంచి గడియలు ఉన్నాయని పేర్కొంటున్నారు. సెప్టెంబర్ నెలలో 23, 24, 26, 27, 28, అక్టోబర్ మాసంలో 1 ,2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31 ఇలా 19 రోజులు శుభముహూర్తాలతో సందడిగా మారనుంది. ఇక నవంబర్ మాసంలోనూ సగం నెల మంచి రోజులే ఉన్నాయి. నవంబర్ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీలు వివాహాలు జరుపుకునేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు వెల్లడించారు. ఇక మరెందుకు ఆలస్యం.. ఇక భాజాలు మోగించాల్సిందే..






