అలసట, నీరసం వంటి సమస్యలకు ఈ గింజలతో సులభంగా చెక్ పెట్టొచ్చు!

by Disha Web Desk 10 |
అలసట, నీరసం వంటి సమస్యలకు ఈ గింజలతో  సులభంగా చెక్ పెట్టొచ్చు!
X

దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరానికి కావాల్సిన పోషకాలున్న ఆహారాలు తీసుకోవాలి. పౌష్టికాహారంలో గుడ్లు, చేపలు, మాంసం, కూరగాయలు మాత్రమే కాకుండా నట్స్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే నీరసం తగ్గాలంటే ఈ గింజలు తీసుకోండి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పల్లీలు: అలసటతో బాధపడేవారు రోజూ పల్లీలు తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటిని నేరుగా తినకుండా నానబెట్టడం వల్ల శరీరానికి కావాల్సిన బలం చేకూరుతుంది.

పచ్చికొబ్బరి: నీరసం, అలసట తగ్గించడంలో పచ్చి కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, దీనిలో కొలెస్ట్రాల్ ఉండదని నిపుణులు పేర్కొన్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.

పుచ్చకాయ గింజలు: పుచ్చకాయ గింజలు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, రాగి, జింక్ శరీరాన్ని పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల శరీరం బలంగా ఉంటుంది.

అవిసె గింజలు: అవిసె గింజలు అలసటను తగ్గిస్తాయి. అంతే కాకుండా, ఈ విత్తనాలలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

గుమ్మడి గింజలు: నానబెట్టిన గింజలు తినడం వల్ల నీరసం తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఐరన్ మీ శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.


Next Story

Most Viewed