- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్త్రీల మెదడుపై ఎఫెక్ట్ చూపిస్తున్న లింగ వివక్ష.. ఏకంగా నాలుగు దశల్లో..
లింగ వివక్ష అనేది బాల్యం నుంచే పిల్లల మెదడులోకి ఎక్కిస్తుంది సొసైటీ. దీని కారణంగా మగాళ్లు అంటే బలం.. ఆడాళ్లు అంటే బలహీనతగా వివరించబడుతుంది.

దిశ, ఫీచర్స్ : ఇండియాలో లింగ వివక్ష అనేది డప్పు కొట్టి ప్రకటించబడదు. సైలెంట్‌గా వచ్చేస్తుంది. బ్రెయిన్‌లోకి ఎక్కేస్తుంది. డిన్నర్ టైంలో నీ పక్కన కూర్చుని.. ‘ఇంత వయసొచ్చింది ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’ అని అడుగుతుంది. స్కూల్‌లో అబ్బాయిల ఆత్మవిశ్వాసం గురించి పొగుడుతూ.. అమ్మాయిల విధేయత గురించి ప్రశంసిస్తుంది. ఆఫీసులో స్త్రీలు రెట్టింపు పని చేసి.. కాస్త ఫైర్ అయినా.. మీరు చిరునవ్వుతోనే ఉండాలని చెప్తుంది. కాలక్రమేణా అది బయటి సమస్యగా కాకుండా మనసులోనే పెద్ద సమస్యగా మారిపోయి పాతుకుపోతుది. అందుకే సెక్సిజం కేవలం సామాజిక ఇబ్బంది మాత్రమే కాదు మెంటల్ కండిషనింగ్ సిస్టమ్ అంటున్నారు నిపుణులు. బ్రెయిన్ పదే పదే ఇలాంటి సంఘటనలకు ఎక్స్‌పోజ్ అయిన కారణంగా.. దానికి అనుగుణంగా మారిపోతుంది. కాగా ఇక్కడ భారత స్త్రీల మెదడును సైలెంట్‌గా కంట్రోల్ చేసే నాలుగు దశలు ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్.
ప్రారంభంలో మెంటల్ కండిషనింగ్
సరిగ్గా కూర్చో.. గట్టిగా మాట్లాడకు.. చీకటి పడితే బయట ఉండకు.. వేరేవాళ్ల దృష్టిని ఆకర్షించకు.. పుట్టిన ఆడపిల్లలు తమ పేరును కూడా నేర్చుకోకముందే ఈ లింగ వివక్ష పరిచయమవుతుంది. డెవలప్‌మెంటల్ సైకాలజీలో దీన్ని జెండర్డ్ కండిషనింగ్ అంటారు. ఇది చిన్నతనం నుండే మొదలవుతుంది. ఎదిగే వయసులో పదే పదే వినిపించే ఈ మాటలు సురక్షితత్వం, విలువ, గుర్తింపు గురించిన కోర్ నమ్మకాలను రూపొందిస్తాయి. అబ్బాయిలను కొత్తగా అన్వేషించమని ప్రోత్సహిస్తే.. అమ్మాయిలను సెల్ఫ్ రిస్ట్రిక్ట్ చేయమని నేర్పిస్తాయి. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రచురించిన పరిశోధన ప్రకారం.. అమ్మాయిలు అబ్బాయిల కంటే ముందుగా ఈ భయాన్ని ఇంటర్నల్‌గా ఇముడ్చుకుంటారు. భారతదేశంలో ఈ కండిషనింగ్ మరింత తీవ్రంగా ఉంటుంది. అమ్మాయిలకు వారి ప్రవర్తనపైనే సెక్యూరిటీ ఆధారపడి ఉంటుందని నేర్పిస్తారు. ఏదైనా తప్పు జరిగితే.. ‘ఆమెకు ఏమైంది?’ అని అడగరు. ఆ సమయంలో ఎలాంటి బట్టలు వేసుకుంది? ఎక్కడికి వెళ్లింది? ఎందుకు ఒంటరిగా ఉంది? అని అడుగుతారు. న్యూరాలజికల్‌గా.. ఇది హైపర్‌విజిలెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. మెదడులో భయానికి కేంద్రమైన అమిగ్డాలా అతిగా యాక్టివ్ అవుతుంది. దీని ఫలితంగా అమ్మాయిల్లో దీర్ఘకాలిక ఆందోళన, రెండోసారి ఆలోచించడం, పర్యావరణాన్ని నిరంతరం స్కాన్ చేయడం వంటి అలవాటు వచ్చేస్తుంది. చాలా మంది భారతీయ మహిళలు పబ్లిక్ స్పేస్‌లలో రిలాక్స్ కాలేరు ఎందుకంటే వారి బ్రెయిన్‌కు పబ్లిక్ స్పేస్‌లు వారికి చెందినవని ఎవరూ చెప్పలేదు. అదో ప్రమాదకరమైన స్థలంగానే పరిగణిస్తారు.
వాచ్ మెన్ అయిపోవడం
సంవత్సరాల తరబడి ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని తీర్పు చెప్పబడడం.. సరిచేయబడడం.. హెచ్చరించబడడంతో.. మహిళలు ఒక ప్రమాదకరమైన మెంటల్ ట్రిక్ నేర్చుకుంటారు. తమను తాము ఒకటికి పదిసార్లు చూసుకోవడం మొదలుపెడతారు. దీన్ని ఇంటర్నలైజ్డ్ సెల్ఫ్ సర్వైలెన్స్ అంటారు. దుస్తుల నుంచి మొదలుపెడితే ఆశయాలు వరకు.. ఎలా నవ్వాలి నుంచి స్టార్ట్ చేస్తే ఎవరితో స్నేహం చేయాలనే నిర్ణయం వరకు.. కోపం వచ్చినా సరే ఎక్స్‌ప్రెస్ చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచించడం వరకు.. ప్రతిదీ మానిటర్ చేసుకుంటారు. ప్రపంచం వేలెత్తి జడ్జ్ చేయకముందే.. తమను తాము ఎడిట్ చేసుకుంటారు. ఇది ఎప్పుడూ ఆఫ్ కాని ఓ అంతర్గత CCTV కెమెరా లాంటిది. ప్రముఖ సైకాలజిస్ట్ దీన్ని మహిళలు తమకు తాము ఓ బయటి వ్యక్తిగా చూసుకోవడం.. నిరంతరం ఇతరులకు ఎలా కనిపిస్తున్నారో అంచనా వేయడంగా చెప్తున్నారు. కాగా ఈ పద్ధతి చాలా మంది భారతీయ మహిళల్లో ఇంపోస్టర్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. అంటే ఓ పని చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని తెలిసినా.. బయటి వ్యక్తులు ఏమనుకుంటారోననే సంకోచం ఎదురవుతుంది.
అడ్జస్ట్‌మెంట్.. ఒకే ఒక్క థెరపీ
ఇంట్లో అడ్జస్ట్ అవ్వు... పెళ్లి విషయంలో సర్దుకుపో... కంఫర్ట్ లేకపోయినా వర్క్ చేయు.. అబ్యూజ్మెంట్ జరిగినా సైలెంట్ అయిపో.. ఇవి అమ్మాయిలకు వినిపించే మాటలు. అంటే భారతీయ మహిళలు ఒక శక్తివంతమైన పదం వింటూ పెరుగుతారు.. అదే అడ్జస్ట్‌మెంట్. న్యూరోసైన్స్ ప్రకారం ఈ అడ్జస్ట్మెంట్ అనేది.. దీర్ఘకాలిక భావోద్వేగ అణచివేత. కాగా ఇది కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. మెమరీ, భావోద్వేగ నియంత్రణ కేంద్రమైన హిప్పోకాంపస్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా బ్రెయిన్ ఫాగ్, భావోద్వేగ నిస్సారత, మోటివేషన్ లేకపోవడం.. నిరంతర ఓవర్‌వెల్మ్ భావన వస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం... భారతీయ మహిళలు పురుషుల కంటే దాదాపు రెండు రెట్లు డిప్రెషన్‌కు గురవుతారు. కానీ సహాయం కోరే అవకాశం చాలా తక్కువ.
సంస్థలు సెక్సిజాన్ని ఎలా సపోర్ట్ చేస్తాయి?
సెక్సిజం వ్యక్తిగత వైఖరులపై మాత్రమే బతకదు. కాగితంపై న్యూట్రల్‌గా కనిపించే.. ప్రాక్టీస్‌లో వివక్షపూరితంగా ఉండే సంస్థలు దీనికి మద్దతు ఇస్తాయి. కార్యాలయంలో చట్టం టెక్నలాజికల్‌గా ఉంది. కానీ సైకాలజీ వేరే కథ చెబుతుంది. 1997లో విశాఖ గైడ్‌లైన్స్, 2013లో POSH యాక్ట్ మహిళలకు సురక్షితమైన ప్రొఫెషనల్ వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడ్డాయి. కాగితంపై ఈ చట్టాలు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు, నిర్దిష్ట సమయంలో పరిష్కారాన్ని ఇవ్వాలని ఆదేశిస్తాయి. కానీ చాలా మంది మహిళలు రిటాలియేషన్ భయం, క్యారెక్టర్ అసాసినేషన్, డిఫికల్ట్ అని లేబుల్ చేయబడే భయంతో హ్యారస్‌మెంట్‌ను రిపోర్ట్ చేయరు. మెదడు ఈ రిస్క్‌ను స్పష్టంగా అంచనా వేస్తుంది. సర్వైవల్ జస్టిస్ కంటే ఈ భయం వెంటాడుతుంది. అంతెందుకు భారతదేశంలో మ్యారిటల్ రేప్ ఇంకా నేరంగా గుర్తించబడలేదు. ఎందుకంటే చట్టం వివాహంతో ఫుల్ పర్మిషన్ ఇస్తుందనే ఫీలింగ్ ఇంకా ఉంది. ‘I do’ అనేది లైఫ్ టైమ్ పర్మిషన్ స్లిప్ లాంటిది. ఈ చట్టపరమైన బ్లైండ్ స్పాట్ ప్రైమరీ సైకాలజీని విస్మరిస్తుంది. నిజానికి సమ్మతి ఒక్కసారి జరిగే సంఘటన అవుతుందా? భయం, ఒత్తిడి, బాధ్యతతో చేసే ఇంటిమసీ.. ఇంటిమసీ అవుతుందా? అది ఒక ట్రామా.
ప్రెషర్ కుకర్ ఎఫెక్ట్
నిజానికి దీన్ని భారతీయ మహిళలు నేర్చుకున్న ‘ప్రెషర్ కుకర్ ఎఫెక్ట్’ అని పిలవచ్చు. లోపలి భావోద్వేగాలను లోపలే ఉంచమని.. గట్టిగా మూత పెట్టమని.. ఫ్లేమ్‌ను అడ్జస్ట్ చేయమని.. చిరునవ్వుతో ఉండమని నేర్పించడం ఇది. కానీ మన చుట్టూ ఉన్నవారు విజిల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు చివరికి అది వస్తే.. ఎందుకు ఇంత ఎమోషనల్‌గా ఉన్నావు అంటారు. నిజానికి ఇది ఓవర్ రియాక్ట్ కాదు. నరాల వ్యవస్థ చిన్నప్పటి నుంచి శిక్షణ పొందిన విధంగానే స్పందిస్తుంది.






