- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్ టీ తాగుతున్నారా..? ప్రతీ కప్పులో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!
ప్రీమియం టీ బ్యాగ్ ముంచడం వల్ల ప్రతీ కప్పు టీలో 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్‌ల(566 కోట్లు)ను 3.1 బిలియన్ నానోప్లాస్టిక్‌లను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు టీ పౌడర్ వేసి మాత్రమే టీ తయారు చేసేవారు. గ్రీన్ టీ కూడా తేయాకుల్ని నీటిలో మరిగించి చేసేవారు. కానీ ఇటీవల కొత్త ట్రెండ్ ముందుకొచ్చింది. ఏంటంటే.. గ్రీన్ టీ, మిల్క్ టీ వంటివి తాగేటప్పుడు దారంతో కట్టి ఉన్న చిన్నపాటి ప్రీమియం టీ బ్యాగులను వాటిలో ముంచుతూ తాగుతుంటారు. ఎందుకంటే అందులో తేయాకు ఉంటుంది. అంటే టీ ఉడికించేటప్పుడు వేసే పౌడర్‌కు బదులుగా కప్పులో తాగుతున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా ముంచేస్తే తేయాకు ద్వారా కలిగే ప్రయోజనాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ వాస్తవానికి ఇది ప్రమాదకరమని కెనడాలోని మ్యాగిల్ యూనివర్సిటీ(McGill University) పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రీమియం టీ బ్యాగులు ముంచిన టీలో మైక్రోప్లాస్టిక్‌లు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయని తేలింది.
ప్రతీ కప్పు ప్రమాదమే..
వేడి వేడి గ్రీన్ టీలో కానీ, పాలల్లో కానీ ప్రీమియం టీ బ్యాగును ముంచుతూ.. ఆ సువాసను ఆస్వాదిస్తూ చాయ్ తాగడం చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది. ఇది అద్భుతంగా అనిపించవచ్చు. కానీ వాస్తవం చాలా ఆందోళనకరం అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. ఈ ప్రీమియం ప్లాస్టిక్ టీబ్యాగ్‌ను ముంచడంవల్ల మీరు తాగుతున్న ప్రతీ కప్పు టీలో 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్‌ల(566 కోట్లు)ను 3.1 బిలియన్ నానోప్లాస్టిక్‌లను విడుదల చేస్తుంది. ఈ విషయాన్ని పరిశోధకులు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీతో గుర్తించారు. ఇవి టీబ్యాగ్ తయారీకోసం ఉపయోగించే నైలాన్, పాలిస్టర్ మెటీరియల్స్ నుంచి వస్తున్నట్లు కనుగొన్నారు. కొందరు వీటి తయారీ పూర్తిగా బయోడిగ్రేబుల్ అని చెబుతున్నప్పటికీ పరిశోధనలు మాత్రం అది వాస్తవం కాదంటున్నాయి. చాలావరకు వాటిలో PLA (polylactic acid) అనే ప్లాస్టిక్ ఉంటున్నట్లు పేర్కొంటున్నాయి.
ఏం జరుగుతుంది?
ప్రీమియం టీ బ్యాగులను టీలో ముంచి తాగడంవల్ల వాటి నుంచి వెలువడే మైక్రోప్లాస్టిక్‌లు టీ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి హాని చేస్తాయి. జన్యు లోపాలకు, రీ ప్రొడక్టివ్ సమస్యలకు దారితీస్తాయి. అంతేకాకుండా రక్తం, ఊపిరితిత్తులు, ఇమ్యూన్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తాయి. రక్తంలో కలిసి పోవడంవల్ల అనారోగ్యాలకు, హర్మోన్ల అసమతుల్యతకు, క్యాన్సర్లకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 2024లో బార్సిలోనా యూనివర్సిటీ అధ్యయనం కూడా ప్రీమియం టీ బ్యాగుల్లోని మైక్రోప్లాస్టిక్స్ మానవ కణాల్లోకి చేరి గట్ బారియర్‌ను దెబ్బతీస్తాయని చెప్పింది.






