COPD రోగులకు బిగ్ బూస్ట్: అందుబాటులోకి ఏఐ పోర్టబుల్ ఆక్సిజన్ సిస్టమ్స్!

by Javid Pasha |   (  Updated:2025-11-11 09:32:46  IST  )

హోమ్ ఆక్సిజన్ థెరపీలో భాగంగా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) బాధితులకు మెరుగైన శ్వాస ఆరోగ్యాన్ని అందించే సాంకేతికత ఇప్పుడు అందుబాటుకి వచ్చింది

COPD రోగులకు బిగ్ బూస్ట్: అందుబాటులోకి ఏఐ పోర్టబుల్ ఆక్సిజన్ సిస్టమ్స్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఒకటి. నిజానికి ఇది శ్వాసకోశ వ్యాధుల సమూహం. ప్రధానంగా ఇందులో ఎంఫీసీమా అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ ఉంటాయి. గాలి మార్గాలు ఇరుకైపోవడం(obstruction), శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు దగ్గు, కఫం, అలసట వంటివి దీని ముఖ్య లక్షణం. సాధారణంగా ధూమపానం, గాలి కాలుష్యం, రసాయన ధూళి, జన్యు కారకాలు ఇందుకు దారితీస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ సమస్య అధికమైతే.. ఊపరి ఆడక ప్రాణాలు పోయే చాన్స్ కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇప్పుడు ఏఐ ఆధారిత పోర్టబుల్ ఆక్సిజన్ వ్యవస్థలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. వాటి ఉపయోగాలేమిటో చూద్దాం.

హోమ్ ఆక్సిజన్ థెరపీలో భాగంగా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) బాధితులకు మెరుగైన శ్వాస ఆరోగ్యాన్ని అందించే సాంకేతికత ఇప్పుడు అందుబాటుకి వచ్చిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిలో పోర్టబుల్ ఆక్సిజన్ సిస్టమ్స్ కూడా ఒకటి. చాలా కాలంగా ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ, తక్కువ ఆక్సిజన్ ఫ్లో, తక్కువ బ్యాటరీ లైఫ్ కారణంగా రోగుల యాక్టివిటీస్‌ను పరిమితం చేస్తున్నాయి. కానీ ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ సరఫరాను ఆటోమాటిక్‌గా సర్దుబాటు చేయగల ఏఐ ఆధారిత అధునాతన పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు(POCs), లేదా పోర్టబుల్ ఆక్సిజన్ సిస్టమ్స్‌ను సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేస్తున్నారు. ఇవి సీఓపీడీ బాధితుల్లో జీవన నాణ్యతను మెరుగుపర్చడంలో సహాయపడతాయి. Link

Next Story