కప్పు కాఫీపై వెయ్యి రెట్లు జరిమానా.. తల పట్టుకున్న యజమాని

by Disha Web |
కప్పు కాఫీపై వెయ్యి రెట్లు జరిమానా.. తల పట్టుకున్న యజమాని
X

దిశ, ఫీచర్ : మొదటి ఇటాలియన్ కాఫీ బార్‌గా పేరొందిన డిట్టా ఆర్టిజియానాలే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఫ్లోరెన్స్‌లోని టుస్కాన్ నగరం నడి మధ్యలో ఉన్న ఈ కేఫ్‌లో.. కప్పు కాఫీ రూ.84 కాగా.. ఓ కస్టమర్‌కు కెఫిన్ లేని కప్పు కాఫీకి రూ.168 వసూల్ చేసింది యాజమాన్యం. దీంతో ఆగ్రహానికి లోనైన వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కాఫీ ధరకు వెయ్యిరెట్లు జరిమానా విధించారు. ఇటలీలో కాఫీ ధరల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం కాగా.. రూ.84 వేలు కట్టాల్సి వస్తోంది. దీనిపై స్పందించిన బార్ యజమానికి ఫ్రాన్సిస్కో సనాపో... 'నా తప్పుకు డబ్బును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ బార్‌లలో సర్వ్ చేసే ప్రతిదానిని చట్టబద్ధం చేయాలని కోరుకుంటున్నా. లేకపోతే 99.9 శాతం బార్‌లు, రెస్టారెంట్‌లు తప్పుచేసినట్లుగానే మిగిలిపోతాయి' అన్నాడు.

Next Story