మంచు కురిసే వేళలో.. మనసు దోచే పర్యాటక అందాలు..! మన దేశంలోనే..

by Javid Pasha |

ఉత్తరా ఖండ్‌లోని చోప్తా అనే చిన్న పర్వత ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. డిసెంబర్‌లో మంచు కప్పబడి మినీ స్విట్జర్లాండ్‌ను తలపిస్తుంది.

మంచు కురిసే వేళలో.. మనసు దోచే పర్యాటక అందాలు..! మన దేశంలోనే..
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ సీజన్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో వింటర్ ఒకటి. ముఖ్యంగా పర్యాటకులు తమ ప్రయాణాల కోసం ఎక్కువగా చలికాలాన్ని ఎంచుకుంటూ ఉంటారు. మంచు కురిసే వేళల్లో, సాయంకాలపు సమయాల్లో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉండటమే అందుకు కారణం. ఏమాత్రం టైమ్ దొరికినా మనసు దోచే అందమైన ప్రాంతాలను, టూరిస్ట్ ప్లేస్‌లను చుట్టి రావాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారిని ఆకట్టుకునే ఇండియాలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్పితి వ్యాలీ

స్పితి లోయ(Spiti Valley) హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత అందమైన రిమోట్ హిమాలయన్ ప్రాంతం ఇది. డిసెంబర్ నెలలో మంచు కప్పబడి మరింత అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో అనేకమంది ఈ లోయను సందర్శించడానికి వస్తుంటారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, సాహసికులు ఇక్కడికి వచ్చి ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందాలని భావిస్తారు. దీంతోపాటు ఈ అందమైన లోయలో మంచుతో కూడిన నదులు, గడ్డ కట్టిన మంచు పర్వతాలు, పురాతన మఠాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ మీరు స్కీయింగ్, స్నోబోర్డింగ్, ఐస్ క్లైంబింగ్, ఫ్రోజెన్ వాటర్‌ఫాల్స్‌లో ట్రెక్కింగ్ వంటివి చేయడం, చూడటం మధురానుభూతికి లోను చేస్తాయి. శీతాకాలంలో స్పితి రోడ్ ట్రిప్‌లు మనాలి లేదా షిమ్లా నుండి మొదలై, కజా, తాబో, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్తాయి. ఇక్కడ స్నో లెపర్డ్‌ల(snow leopards)ను, అంటే మంచు ప్రాంతాల్లో ఉండే జంతువులను చూడటం ఆనందాన్ని కలిగిస్తుంది.

మినీ స్విట్జర్లాండ్‌, చోప్తా

ఉత్తరా ఖండ్‌లోని చోప్తా అనే చిన్న పర్వత ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. డిసెంబర్‌లో మంచు కప్పబడి మినీ స్విట్జర్లాండ్‌ను తలపిస్తుంది. అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు చూస్తే ఎవరికైనా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేంత అద్భుతంగా ఉంటాయి. దీంతోపాటు ఇక్కడి త్రిశూల్, నందా దేవి అండ్ చౌఖంబ వంటి హిమాలయన్ శిఖరాలు మంచుతో కప్పబడి మరింత అందంగా దర్శనమిస్తాయి. ఈ ప్రాంతం తుంగనాథ్ అండ్ చంద్రశిలా ట్రెక్‌లకు ప్రసిద్ధి. డిసెంబర్‌లో మంచుతో నిండిన రహదారులు స్నో ట్రెక్కింగ్ అండ్ వింటర్ క్యాంపింగ్‌కు అనువుగా ఉంటాయి. ఇక్కడ మంచు మీద నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంలో తేలియాడుతుంటారు టూరిస్టులు. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఈ స్థలం శీతాకాలంలో చలికారణంగా తక్కువమంది టూరిస్టులతో ప్రశాంతమైన వాతావరణంతో భలే ఆకట్టుకుటుంది. డిసెంబర్ నుండి జనవరి వరకు ఇక్కడి వాతారణం హనీమూన్ జంటలకు ఫేవరెట్ స్పాట్ అని చెప్పవచ్చు.

పట్నీతోప్, జమ్మూ కశ్మీర్‌

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో అందమైన పర్వత ప్రాంతం పట్నీతోప్ (Patnitop), ఇక డిసెంబర్‌లో అయితే ఈ హిల్ స్టేషన్ మంచు కప్పబడిన స్వర్గ ధామంగా అనిపిస్తుంది. చాలామంది టూరిస్టులు, ప్రకృతి ప్రేమికులు తమ కుటుంబాలతో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్లెడ్జింగ్ అండ్ జోర్బింగ్ వంటి సాహసాలు చూడటం, చేయడం థ్రిల్లింగ్ అని చెబుతుంటారు. అంతేకాకుండా ఇక్కడి రోప్‌వే, కేబుల్ కార్ అండ్ పారాగ్లైడింగ్ వంటి యాక్టివిటీస్ అందరికీ నచ్చుతాయి. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంచు పడటం వల్ల నాథాటాప్ అండ్ సనాసర్ వంటి సమీప ప్రదేశాలు స్నో వాక్స్ అండ్ మీడోస్ ఎక్స్‌ప్లోరేషన్‌కు అనువుగా ఉంటాయి. వింటర్ ఫెస్టివల్స్, స్కీయింగ్ కాంపిటీషన్లు కూడా ఇక్కడ జరుగుతాయి. జమ్మూ నుంచి ఇక్కడి సులభంగా చేరుకోవచ్చు.

రణక్‌పూర్, రాజస్థాన్‌

రాజస్థాన్‌లోని ఓ అందమైన ఈ చిన్న గ్రామమే రణక్‌పూర్. ఇక్కడి అందమైన ఆరావళి పర్వతాలు(Aravalli Mountains), వాటి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, ఎగుడు దిగుగు పచ్చని లోయల చూడముచ్చటగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడి జైన్ టెంపుల్స్, ముఖ్యంగా సూర్య నారాయణ టెంపుల్ వంటి ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రదేశం మార్బుల్ జైన్ టెంపుల్‌తో ప్రసిద్ధి చెందింది. ఆరావళి హిల్స్ మధ్య ఉండి, స్పిరిచ్యువల్ హెరిటేజ్ టూరిజమ్‌కు సూటబుల్ అని చెప్పవచ్చు. సమీపంలోని రణక్‌పూర్ డ్యామ్, ముచ్చల్ మహావీర్ టెంపుల్ అండ్ ఎలిఫెంట్ హిల్‌టాప్ వంటి సైట్స్ నేచర్ వాక్స్ జంగిల్ సఫారీలకు ప్రసిద్ధి. డిసెంబర్‌లో మంచుతో కూడిన చలివాతావరణం కారణంగా ఉదయపూర్ అలాగే మౌంట్ అబు మధ్య ఉన్న ఈ లోయలు ఆకట్టుకుంటాయి.

మనాలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత అందమైన డెస్టినేషన్ మనాలి. ప్రపంచ పర్యాటకులు మెచ్చిన ఈ పర్యాటక ప్రాంతం డిసెంబర్‌లో మరింత అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. హిమపాతంతో నిండిన వింటర్ వండర్‌ల్యాండ్‌గా మారుతుంది. స్నో అడ్వెంచర్లు, అలాగే ఫెస్టివ్ ఫన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి సోలాంగ్ లోయలో స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నోమొబైల్ రైడ్స్ వంటి యాక్టివిటీల్లో పాల్గొనడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. డిసెంబర్ నుండి మార్చి వరకు ఇక్కడి వాతావరణం, పర్వత ప్రాంతం, పచ్చిక బయళ్లు అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. టూరిస్టుల్లో మధురానుభూతిని కలిగిస్తాయి. పారాగ్లైడింగ్, స్నోమెన్ బిల్డింగ్, స్నోబాల్ ఫైట్స్ వంటి ఫ్యామిలీ అడ్వెంచర్లు కూడా ఉంటాయి. క్రిస్మస్ కేఫ్‌లు, వింటర్ మార్కెట్స్, ఇగ్లూ స్టేస్ ఇక్కడ స్పెషల్. అలాగే ఓల్డ్ మనాలి స్నో పాయింట్ అండ్ వషిష్ట్ విలేజ్ వంటి స్పాట్స్ పీస్‌ఫుల్ రిట్రీట్స్ అందిస్తాయి.

Next Story