Viral News: ఈ పండు తింటే వచ్చే కిక్కు.. ఫుల్ బాటిల్ కూడా ఇవ్వదురా బాలరాజు

by Vennela |

Viral News: పైనాపిల్ పండు అందరికీ ఇష్టమే.

Viral News: ఈ పండు తింటే వచ్చే కిక్కు.. ఫుల్ బాటిల్ కూడా ఇవ్వదురా బాలరాజు
X

దిశ, వెబ్ డెస్క్: Viral News: పైనాపిల్ పండు అందరికీ ఇష్టమే. ఎంతో జ్యూసీగా ఉండే ఈ పండును చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తింటుంటారు. అయితే ఈ పండు తింటే కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే కిక్ ( మత్తు) వస్తుంది. ఈ పండు వైన్ లాగే మారిపోతుంది. ఈ జ్యూస్ తాగితే.. బీర్ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఈ పైనాపిల్ వైన్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సులభంగానే ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు రెండు పైనాపిల్ ముక్కలు తీసుకుని పై తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఓ సీసాలో ఉంచి..అందులో 250 గ్రాముల పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత యాక్టివ్ డ్రై ఈస్ట్ 10 గ్రాములు అందులో కలపాలి. ఇది మార్కెట్లో లభిస్తుంది. 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. అందులో అన్నీ వేసిన తర్వాత నీళ్లు పోయాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోయకూడదు. ముక్కలు మునిగే వరకు పోయాలి. బాగా కలపాలి. సీసాకు మూతపెట్టాలి. గాలి చేరనివిధంగా టైట్ గా పెట్టకూడదు. ఇలా 14రోజులు ఉంచాలి. 14రోజుల తర్వాత ఆ ముక్కల్లోని నీటిని ఫిల్టర్ చేయాలి. సీసాను శుభ్రంగా కడిగి..మళ్లీ అదే సీసాలో వేసి మూత పెట్టాలి. వారం తర్వాత చూస్తే స్మూత్ గా ఉండే పైనాపిల్ వైన్ తయారు అవుతుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. తియ్యగా, పుల్లగా, వైన్ రుచితో ఉంటుంది. కొంతమంది 7 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచుతారు. అప్పుడు రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్మూత్ గా ఉంటుంది.

మనకు రియల్ వైన్ లో ఆల్కాహాల్ 12శాతం వరకు ఉంటుంది. బీర్ లో 4 నుంచి 6శాతం ఉంటుంది. పైనాపిల్ వైన్ లో ఆల్కహాల్ కంటెంట్ 9 నుంచి 12శాతం ఉంటుంది. అందుకే వైన్ తాగినప్పుడు ఎలాంటి కిక్ ఎక్కుతుందో ఇది తాగినప్పుడు కూడా మత్తు అలాగే ఎక్కుతుంది. ఒక లీటర్ పైనాపిల్ వైన్ తయారు చేసేందుకు రూ. 200 ఖర్చు అవుతుంది. అదే పైనాపిల్ వైన్ బాటిల్ కొనుక్కుంటే 400 నుంచి 500 రూపాయలు అవుతుంది.

Next Story