- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మా టు రియల్.. భారీ పెట్టుబడులతో కంపెనీలు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకుపోతున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో : ఫార్మా కంపెనీలు రియల్ రంగంవైపు చూస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, లగ్జరీ అపార్ట్ మెంట్లు నిర్మించి, ఐటీ టవర్లు కట్టేస్తున్నాయి. అసలు ఫార్మాకు రియల్ ఎస్టేట్ కు సంబంధం లేకపోయినా కొన్ని బడా కంపెనీలు మాత్రం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకుపోతున్నాయి.
నియోపొలిస్ లో ఎంఎస్ఎన్ భారీ ప్రాజెక్ట్
ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ...హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో ఒకటి. ఆ కంపెనీ నియోపొలిస్ లో బహుళ అంతస్తులు నిర్మిస్తోంది. పెద్ద ఎత్తున అల్ట్రా లగ్జరీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటుంది.
అరబిందో రియాల్టీ..
ప్రముఖ అరబిందో ఫార్మా కూడా ఇటీవల రియల్ ఎస్టేట్ లోకి అడుగు పెట్టింది. అరబిందో రియాలిటీ పేరుతో లగ్జరీ అపార్టుమెంట్లు, ఐటీ టవర్లను నిర్మిస్తోంది. అరబిందో పేరు వాడటం.. అరబిందో వారసుడు శరత్ చంద్రారెడ్డి కేసుల్లో ఇరుక్కోవడంతో వాటాదారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో అరబిందో రియాలటీ పేరును ఔరో రియాలటీ అని మార్చి .. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
హెటిరో..ఐటీ టవర్లు..
ఫార్మా దిగ్గజ కంపెనీ హెటిరో రియల్ రంగంలోకి దూసుకుపోతుంది. మాదాపూర్ లో అతిపెద్ద ఐటీ టవర్స్ కట్టి.. అంతర్జాతీయ కంపెనీల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ కు అద్దెకు ఇస్తున్నారు. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే మరిన్ని ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రముఖ ఫార్మా కంపెనీ యజమాని రాజేశ్ తెలియజేశారు.






