- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్కు సైజును బట్టి పురుషాంగం పరిమాణం.. క్లారిటీ ఇదే!
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వార్త సారాంశం ఏంటంటే.. మగాళ్ల ముక్కు సైజును బట్టి వారి పురుషాంగం పరిమాణం ఉంటుందని.

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వార్త సారాంశం ఏంటంటే.. మగాళ్ల ముక్కు సైజును బట్టి వారి పురుషాంగం పరిమాణం ఉంటుందని. కానీ ఇది ఎంత వరకు నిజం.. అసలు ముక్కుకు, పురుషాంగానికి సంబంధం ఏంటి..? దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏంటి అనేది ఓసారి పరిశీలిద్దాం.
గతంలోనూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. మహిళల పెదవుల సైజు ఆధారంగానే వారి యోని పరిమాణం ఉంటుందని అప్పట్లో తెగ వైరల్ అయింది. కానీ, ఈ తర్వాత అది తప్పుడు వార్త అని తేలింది. ప్రస్తుతం పురుషాంగం సైజుపై వస్తున్న కథనం వివరాల్లోకి వెళ్తే.. సహజంగా పురుషాంగం సైజు 4.1 ఇంచుల నుంచి 5.3 ఇంచుల వరకు ఉంటుంది. అతి కొద్ది మందిలో ఒకరికి 6 ఇంచుల పొడవు వరకు ఉండే అవకాశం ఉన్నా అది చాలా అరుదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పురుషులు గుర్తుంచుకోవాల్సి ప్రధాన అంశం.. పురుషాంగం ఎంత పొడవు ఉన్నా.. యోనిలోతు కేవలం నాలుగు ఇంచులే కాబట్టి అది అంత వరకే వెళ్తుందని గ్రహించాలి. అంతకంటే ఎక్కువ పొడవు ఉన్నా అది యోని వెలుపలే ఉంటుంది. ఈ సైజు కూడా కామోద్రేకానికి గురైన సమయంలో ఉంటే చాలు.
అయితే, జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ వైద్య విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో పురుషాంగం సైజుపై ఆసక్తికర కథనం వెలుబడింది. పరిశోధకులు 126 మంది పురుష మృతదేహాలపై ఈ అధ్యయనం చేశారు. వారు మరణించిన మూడు రోజుల్లోపు వారి పురుషాంగాలను చేత్తోలాగి కొలతలు తీసుకున్నారు. ఈ పరిశోధన ఆధారంగా పొడవాటి ముక్కున్న పురుషుల పురుషాంగం నిటారుగా ఉన్నప్పుడు 5.3 ఇంచులు, చిన్న ముక్కున్న వారిలో 4.1 ఇంచుల పొడవు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కొలతలపై ఇంకా విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు బృందం అభిప్రాయపడింది.
కాగా, ఈ పరిశోధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుషాంగం వారి జెనెటిక్స్, తీసుకునే ఆహారం, హార్మోన్ల సమతుల్యతపై ఆధార పడి ఉంటుందని, ముక్కుకు జననాంగానికి సంబంధం లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం ముక్కుకు జననాంగానికి మధ్య సంబంధం ఉందని సైన్స్‌లో ఉందని, దాని ఆధారంగా పురుషాంగం పరిమాణం ముక్కు సైజుపై ఆధారపడి ఉంటుందని వాదిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే పురుషాంగాల సైజులపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.






