- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: పవన్ చేతిపై టాటూ.. తిరంగ ర్యాలీలో పవన్ కల్యాణ్‌వైపే అందరిచూపు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడలో తిరంగా యాత్రలో పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడలో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేయి పైన అందరి దృష్టిపడింది. ఆయన చేయి పై త్రిశూలం గుర్తును చూసి అందరూ ఇది ఎందుకబ్బా అని ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతి పైన కనిపిస్తున్న ఈ టాటూకి అర్థం ఏమిటా అని నెటిజన్లు సైతం నెట్ ఇంట సెర్చ్ చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజి సినిమా షూటింగులో చురుగ్గా పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలిసింది. అందులో భాగంగానే ఆయన చేతి పైన ఈ టాటూ ఉందని చెబుతున్నారు. అయితే ఈ త్రిశూలం టాటూ కూడా ఓ జి అనే అక్షరాలు వచ్చే లాగానే ఉంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన అనంతరం పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేస్తారా చేయరా అనే సందిగ్ధం ఏర్పడింది. ఎన్నికలకు ముందే ఆయన దాదాపు మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించారు. అందులో హరిహర వీరమల్లు సినిమా సగం షూటింగ్ పూర్తవగా, ఓజి సినిమా కూడా షూటింగ్ సైతం సగం పూర్తయింది. మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమై టీజర్ రిలీజ్ అయింది.
అయితే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పరిపాలనలో బిజీ అయిపోయారు దీంతో సినిమా షూటింగులన్నీ అటక ఎక్కాయి. అయితే ప్రొడ్యూసర్లు సగం షూటింగ్ పూర్తవడంతో ఎలాగైనా డేట్స్ ఇస్తే చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటామని విజయవాడలోనే సెట్లు వేసి సిద్ధంగా ఉంచారు.
వీటిలో హరిహర వీరమల్లు సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించి, ఇప్పటివరకు తీసిన షూటింగును మొదటి భాగంగా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక వీటిలో OG సినిమాకు మరికొన్ని డేట్స్ ఇస్తే సరిపోతుంది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమా పైన అభిమానుల పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్నాడు.






