- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిదండ్రులు పిల్లల ముందు సన్నిహితంగా ఉండొచ్చా?
తల్లిదండ్రులు తమ శృంగార జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యం కాకపోతే ఏం చేయాలి? తమ పిల్లల ముందు సన్నిహితంగా ఉండొచ్చా?

దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రులు తమ శృంగార జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యం కాకపోతే ఏం చేయాలి? తమ పిల్లల ముందు సన్నిహితంగా ఉండొచ్చా? అంటే అలా చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. మీ బేబీ ఆరు నెలల కన్నా చిన్న వయసులో ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వయసులో శిశువులు తరుచుగా REM స్లీప్ మోడ్‌లో ఉంటారు. పరిసరాల గురించి తక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ సాన్నిహిత్యంగా ఉండటం సురక్షితమే.
కానీ పిల్లలు పెరుగుతున్నా కొద్ది బ్రెయిన్ డెవలప్ అవుతుంది. వారి శరీరంపై వారికి అవగాహన పెరుగుతుంది. ఈ దశలో తమ అవయవాలను తాకడం ప్రారంభిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందు ఇంటిమసీకి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన పిల్లల మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి అనుభవాలు మనస్సుపై ముద్ర వేయవచ్చు. లైంగిక ప్రవర్తనను అనుకరించాలనే కోరిక కలగవచ్చు. ఇలాంటి అనుచిత దృశ్యాలు చూడటం.. యుక్త వయస్సులో బిహేవియరల్ చేంజెస్‌తో సహా చాలా ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు. ఇంటిమసీ ఒక వ్యసనంగా మారడం, అపోజిట్ జెండర్‌కు అట్రాక్ట్ అవడం జరుగుతాయి. కాబట్టి పిల్లల మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ముందు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి. వారి పూర్తి శ్రేయస్సుకు అనుకూలమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
ఏది బెటర్ ?
* తల్లిదండ్రులు స్లీప్ టైమ్ షెడ్యూల్‌లో ప్రైవేట్ సమయాన్ని గడపాలి.
* బెడ్ రూమ్ తలుపులకు తాళాలు వినియోగించాలి.
* స్థిరమైన నిద్రవేళ దినచర్యలను ఏర్పాటు చేస్తే.. పేరెంట్స్ రిలేషన్ స్ట్రాంగ్ అవుతూనే పిల్లల భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడొచ్చు.






