- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జన్యువులను ప్రభావితం చేస్తున్న తల్లిదండ్రుల స్పర్శ.. పిల్లలకు ఏ విధంగా మేలు చేస్తుందంటే.. ?
ప్రేమ, ఆప్యాయతతో కూడిన స్పర్శ(Touch), ఆలింగనం, శ్రద్ధ వంటివి కేవలం భావోద్వేగ చర్యలు మాత్రమే కాదు, ఇవి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.

దిశ, ఫీచర్స్ : మనిషికి గాలి, నీరు, ఆహారం మాదిరిగానే ఆత్మీయ వ్యక్తుల స్పర్శ కూడా చాలా ముఖ్యమని, అది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు చిన్న పిల్లలకు తల్లిదండ్రుల స్పర్శ, ఇతర కుటుంబ సభ్యుల స్పర్శ, ప్రియమైన ఇద్దరు వ్యక్తుల మధ్య హగ్గింగ్, షేక్ హ్యాండ్ వంటి స్పర్శలు వారిలో మానసిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. జన్యువులను ప్రభావితం చేయడం ద్వారా మొత్తం శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఎపిజెనెటిక్స్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ప్రేమ, ఆప్యాయతతో కూడిన స్పర్శ(Touch), ఆలింగనం, శ్రద్ధ వంటివి కేవలం భావోద్వేగ చర్యలు మాత్రమే కాదు, ఇవి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా శారీరక స్పర్శ జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేయగలదని, వైద్య సంబంధిత (Activating healing-related genes) జన్యువులను యాక్టివేట్ చేస్తూ, దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న జన్యువులను అణచివేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఆలింగనం ఒత్తిడిని తగ్గించి, ఆక్సిటోసిన్(Love hormone)ను విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది శారీరక, మానసిక శ్రేయస్సును పెంచుతుంది. రోజువారీ జీవితంలో ఇవి పిల్లల ఆరోగ్యాన్ని, అలాగే మనుషుల మధ్య సంబంధాలను బలపరచవచ్చునని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల స్పర్శ పిల్లలలో డీఎన్‌ఏ మిథైలేషన్‌లో మార్పులకు దారితీస్తుంది. ఇవి జన్యు కోడ్‌ను మార్చకపోయినా, రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ, కణాల వృద్ధాప్యంపై ప్రభావం చూపుతుంది. అంటే ప్రతి స్పర్శ లేదా ఆలింగనం పిల్లలకు సహజ ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు అంటున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






