20లో అలా.. 40లో ఇలా.. ఏజ్‌ను బట్టి మారుతున్న మనుషుల దృక్పథం..!

by Javid Pasha |

20లో అలా.. 40లో ఇలా.. ఏజ్‌ను బట్టి మారుతున్న మనుషుల దృక్పథం..!

20లో అలా.. 40లో ఇలా.. ఏజ్‌ను బట్టి మారుతున్న మనుషుల దృక్పథం..!
X

దిశ, ఫీచర్స్ : ఈ క్షణం కరెక్ట్ అనిపించింది.. మరో క్షణం తర్వాత రాంగ్ అనిపించవచ్చు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం రెండు మూడు రోజులు తర్వాత సరైంది కాదనిపించవచ్చు. ఒక విషయంపట్ల, సమస్యపట్ల, సమాజం పట్ల, వ్యక్తుల పట్ల కలిగే అభిప్రాయాలు కూడా అంతే.. అప్పటి పరిస్థితుల ప్రభావాలో, అవసరాలో, సరైన అవగాహనో, అవగాహన లోపమో ఏదైతేనేం.. ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. అయితే వయసును బట్టి ఇతరుల అభిప్రాయాల గురించి మన దృక్పథం మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కాలంతోపాటు అభిప్రాయాలు మారడం వెనుక వయసు ప్రభావం కూడా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక విషయంలో పట్ల 20 ఏండ్ల వయసులో ఒక అభిప్రాయంతో ఉంటే.. 40 ఏండ్ల వయసులో అది మారవచ్చు. అంటే జీవితంలో వివిధ దశలను దాటుతున్నప్పుడు, ఇతరుల అభిప్రాయాల గురించి మన దృక్పథం మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక పరిపక్వత, జీవన అనుభవాలు, స్వీయ- అవగాహన వంటివి ఇందులో కీ రోల్ పోషిస్తుంటాయి.

20 ఏండ్ల వయసులో..

*ఇరవయ్యేండ్ల వయస్సులో చాలా మంది యువతీ యువకులు తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనే ఆలోచిస్తారు. కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యంగా ఈ దశలో వ్యక్తులు తమ ఐడెంటిటినీ (identity)ను బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో ఉంటారు. సమాజం, స్నేహితులు, కుటుంబం, లేదా సహచరుల అభిప్రాయాలు వీరి స్వీయ-భావన (self-concept)పై ప్రభావం చూపుతాయి.

ఎందుకలా జరుగుతుంది?

*20 ఏండ్ల వయస్సులో మనం సామాజిక ఆమోదం (social approval) కోసం ఆరాటపడతాం. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుందని, సోషల్ స్టేటస్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తాం.

* సైకాలజీ పరంగా 20 ఏండ్ల వయసులో ‘‘external validation’’ (బాహ్య ఆమోదం) కోసం ఆధారపడటం సహజం. ఎందుకంటే వ్యక్తులు ఇంకా తమ సొంత విలువలు, లక్ష్యాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇక సోషల్ మీడియా ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే యువతీ యువకులు తమను తాము ఇతరులతో పోల్చుకుంటారు. ఉదాహరణకు : ఒక 20 ఏండ్ల వ్యక్తి తన దుస్తులు, మాటలు, లేదా విజయాల గురించి ఇతరులు ఏమనుకుంటారని ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడుపుతాడు. ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే, అది వారి ఆత్మవిశ్వాసంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.

40 ఏండ్ల వయస్సులో..

*40 ఏండ్ల వయసుకు వచ్చేసరికి చాలా మంది ఇతరుల అభిప్రాయాల గురించి పట్టించుకోవడం తగ్గిస్తారు. చాలా విషయాల్లో స్వీయ అవగాహనతో ఉంటారు. ఈ దశలో వ్యక్తులు జీవన అనుభవాల ద్వారా స్వీయ విలువ గురించి(self-worth) బలమైన భావనను పొందుతారు.

ఎందుకలా జరుగుతుంది?

*40 ఏండ్ల వయస్సులో వ్యక్తులు తమ జీవితంలో స్థిరత్వం (stability), స్వీయ-అవగాహనను సాధించి ఉంటారు. తమ విలువలు, లక్ష్యాలు, ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటారు.

*ఫ్యామిలీ, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఆర్థిక విషయాలు వంటి లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాల కంటే ఇవే వారికి ముఖ్యమైనవిగా మారతాయి.

*సైకాలజీ పరంగా 40 ఏండ్లలో వ్యక్తులు అంతర్గన భావన లేదా విలువ (internal validation)నూ ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే వారు తమను తాము ఎక్కువగా అర్థం చేసుకుని ఉంటారు. ఉదాహరణకు తన కెరీర్ లేదా కుటుంబ జీవితంపై దృష్టి పెడతారు. ఇతరుల విమర్శలు లేదా అభిప్రాయాలు తన జీవితాన్ని ప్రభావితం చేయవని గ్రహిస్తారు.

60 ఏండ్ల వయస్సులో..

*60 ఏండ్ల వయసు వచ్చేసరికి చాలా మంది ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహిస్తారు. ఏంటంటే.. ఇతరులు తమ గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయించరని, ఈ దశలో వ్యక్తులు జీవితంలో ఎన్నో అనుభవాలను చూసి, సోషల్ డైనమిక్స్ గురించి లోతైన అవగాహనను పొందుతారు.

ఎందుకలా జరుగుతుంది?

* 40 ఏండ్ల వయస్సులో వ్యక్తులు, ఇతరులు కూడా తమ సొంత జీవితానికి సంబంధించిన సమస్యలు, ఆందోళనలు, లక్ష్యాలతో బిజీగా ఉంటారని గ్రహిస్తారు. ఇది ‘‘spotlight effect’’ (అంటే.. మనం ఊహించిన దానికంటే ఇతరులు మన గురించి తక్కువ ఆలోచిస్తారనే సైకాలజీ సూత్రం)ను అర్థం చేసుకోవడం ద్వారా సాధ్యం అవుతుంది.

* జీవన అనుభవాలు, విజయాలు, వైఫల్యాలు వ్యక్తులకు ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ-సమ్మతి (self-acceptance) ఇస్తాయి. ఇది ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు 60 ఏండ్ల వ్యక్తి తన జీవితంలో చేసిన ఎంపికలు, తప్పులు, విజయాలను ఆలోచించి, ఇతరుల అభిప్రాయాలు తన జీవన సంతృప్తిని నిర్ణయించవని గ్రహిస్తాడు.

నిజమైన స్వేచ్ఛ ఎలా, ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

*‘‘ఇతరులు తమ ఓన్ లైఫ్ అండ్ పర్పస్‌పై ఎక్కువ దృష్టి పెడతారు’’ అనే అవగాహన నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఎందుకంటే ఇది చాలా వరకు సామాజిక ఆందోళనల నుంచి విముక్తి చేస్తుంది. దీంతో సొంత విలువలు, లక్ష్యాల ప్రకారం జీవించడం ప్రారంభిస్తాం తప్ప ఇతరుల మెప్పుకోసమో, ఆమోదం కోసమో కాదు.

*మానసిక శాంతి : ఇతరులు ఏమనుకుంటారో అనే ఆందోళన తగ్గడం వల్ల మనస్సు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఉంటుంది. అంతేకాకుండా, ప్రామాణిక జీవించడం అంటే.. మనం మన సొంత ఆసక్తులు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగా జీవించడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందుతారు.

Next Story