Diabetes Breakfast : డయాబెటిస్ ఉందా? కంట్రోల్లో ఉంచే బ్రేక్ ఫాస్ట్ ఇదిగో!

by Javid Pasha |   (  Updated:2025-01-23 08:43:24  IST  )

Diabetes Breakfast : డయాబెటిస్ ఉందా? కంట్రోల్లో ఉంచే బ్రేక్ ఫాస్ట్ ఇదిగో!

Diabetes Breakfast : డయాబెటిస్ ఉందా? కంట్రోల్లో ఉంచే బ్రేక్ ఫాస్ట్ ఇదిగో!
X

దిశ, ఫీచర్స్ : డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా? షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదా..? మీరు తీసుకునే ఆహారాలు కూడా కూడా అందుకు కారణం కావచ్చు. ఎందుకంటే రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి రోజువారీ వ్యాయామాలు, జీవనశైలితోపాటు తీసుకునే డైట్ హెల్తీగా ఉండాలి. ముఖ్యంగా మీరు మీరు బ్రేక్‌ఫాస్ట్ సరైందిగా ఉంటే షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాంటి ఆహారాలు ఏవో చూద్దాం.

*ఉడికించిన గుడ్లు : గుడ్డు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. ఉడికించిన గుడ్లలో బ్లడ్ షుగర్‌ను నియంత్రించే గుణం ఉంటుంది. పైగా వీటిలో ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. కాబట్టి అధిక కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తుంది. గుడ్లలో విటమిన్ బి12, కోలిన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

*ఓట్స్ మీల్ బ్రేక్ ఫాస్ట్ : డయాబెటిస్ బాధితులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఓట్స్ ఓట్స్ చక్కటి ఆహారం. వీటిలో కరిగే స్వభావంగల ఫైబర్ ఉంటుంది. బీటా- గ్లూకాన్ పుష్కలంగా ఉండటంవల్ల షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ మీల్ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరగకుండా అదుపులో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.

*ఫ్రూట్ సలాడ్స్ : పండ్లు సహజంగానే ఆరోగ్యానికి మంచిది. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లను ఎంచుకోవాలి. ముఖ్యంగా స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని సలాడ్‌లలో వినియోగించుకోవచ్చు. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. యాపిల్, ఖర్జూరాలు వంటివి కూడా మేలు చేస్తాయి.

*లో కార్బో హైడ్రెట్ స్మూతీ : లో కార్బొహైడ్రేట్ స్మూతీలు డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చెబుతుంటారు. ముఖ్యంగా కాలే, పాలకూర, స్వీట్ బాదం, పాలు, మిల్క్, బెర్రీలలో లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటితో స్మూతీని తయారు చేసుకొని వినియోగించడం ద్వారా బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

*చియా గింజలు : చూడ్డానికి చిన్నగానే ఉన్నా చియా సీడ్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని నీటితో కలిపితే జెల్ వంటి ఆకారంలో కనిపిస్తాయి. ఇందులో ఫైబర్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ నియంత్రణకు సహాయపడతాయి. చియా గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చియా విత్తనాలను తియ్యని బాదంపాలు లేదా పెరుగులో వేసి నానబెట్టాలి. దానిపై కొన్ని బెర్రీలు లేదా ఇతర గింజలను చల్లాలి. చియా సీడ్ పుడ్డింగ్ రెడీ అయినట్లే. దీనిని బ్రేక్ ఫాస్ట్‌గా తింటే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది.

*గ్రీకు యోగర్ట్ (Greek yogart) : ఇందులో ప్రోబయోటిక్స్, ప్రొటీన్స్ ఉంటాయి. జీర్ణక్రియకు మేలు చేస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను, బాడీలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి గ్రీకు పెరుగులో బెర్రీలను వేసి తింటే నేచురల్ స్వీట్‌నెస్ అండ్ ఫైబర్ లభిస్తుంది. ఇవి షుగర్‌ను నియంత్రిస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story